English | Telugu

"మోనిత‌ని పెళ్లిచేసుకో".. కార్తీక్‌కు‌ సౌంద‌ర్య స‌ల‌హా!

'కార్తీకదీపం' సోమ‌వారం ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతోంది. సిటీని వ‌దిలి వెళ్లిన దీప వార‌ణాసి స‌హాయంతో టిఫిన్ సెంట‌ర్‌ని ప్రారంభిస్తుంది. దానికి 'నాన్న టిఫిన్ సెంట‌ర్'` అని నామ‌క‌రణం చేస్తుంది. తొలి రోజు లెక్క‌లు మాట్లాడుకుంటుంటారు. ఈ లోగా అక్క‌డ‌కి ఒకావిడ వ‌చ్చేసి "నాన్నా నాన్నా అంటున్నారు.. ఏడీ మీ నాన్న?" అన‌డుగుతుంది. "టిఫిన్ సెంట‌ర్ పేరు 'నాన్న టిఫిన్ సెంట‌ర్‌' అని పెట్టారు క‌దా ఎక్క‌డ మీ నాన్న‌? .. టిఫిన్ చేసే వాళ్లు ఇదే అడిగితే ఏమ‌ని చెబుతారు?" అని ప్ర‌శ్నిస్తుంది.

దీంతో శౌర్య "బోర్డు చెరిపేద్దామా" అంటుంది. క‌ట్ చేస్తే మోనిత ఇంట్లో కార్తీక్ "హిమ అడ్ర‌స్ తెలిశాక రౌడీని కూడా తెచ్చేసుకుందాం" అంటాడు మోనిత‌తో. "దీప త‌ప్ప నీతో ఎవ‌రున్నా నాకు అభ్యంత‌రం లేదు.. మ‌న‌మిద్ద‌రం మ‌న‌కిద్ద‌రు." అంటుంది మోనిత‌. అయితే ఇంత‌లో కార్తీక్‌ని వెతుక్కుంటూ సౌంద‌ర్య లోప‌లికి ఎంట్రీ ఇస్తుంది. ఉన్నఫ‌ళంగా సౌంద‌ర్య అక్క‌డ‌కు రావ‌డంతో కార్తిక్‌, మోనిత షాక‌వుతారు.

అప్ప‌టికే త‌ను మోనిత‌కి ప్రామిస్ చేశాన‌ని, హిమ‌ని వెతికి తీసుకొస్తే త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చాన‌ని చెబుతాడు కార్తీక్ . "అయితే మోనిత‌ని పెళ్లి చేసుకో." అని చెప్పి షాకిస్తుంది సౌంద‌ర్య‌. మ‌రి త‌ల్లి సౌంద‌ర్య చెప్పిన‌ట్టే డాక్ట‌ర్ బాబు మోనిత‌ని పెళ్లి చేసుకుంటాడా?.. అలా చేస్తానంటే సౌంద‌ర్య నిజంగా అంగీక‌రిస్తుందా? త‌ల్లీ కొడుకుల మ‌ధ్య ఈ సోమ‌వారం ఎలాంటి చ‌ర్చ జ‌రగబోతోంది అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.