English | Telugu

డాన్స్ షోలో దీప్తి హాట్ పెర్ఫార్మన్స్.. షణ్ముఖ్ పై ట్రోల్స్!

ఆదివారం జ‌రిగిన‌ 'డాన్స్ ప్ల‌స్' గ్రాండ్ ఫినాలేలో దీప్తి సున‌య‌న హాట్ ప‌ర్ఫార్మెన్స్‌, కో డాన్స‌ర్‌తో ఆమె ముద్దులు పెట్టించుకున్న వైనం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ విష‌యంలో ఆమెతో పాటు యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ కూడా ట్రోల‌ర్స్ బారిన‌ప‌డ్డాడు. సోషల్ మీడియాలో దీప్తి సునయన, షణ్ముఖ్ జంటకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి. ఈ జంట ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తమపై వచ్చే వార్తలను చూసీచూడనట్లు వదిలేస్తారు. ఏదైనా ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి అడిగితే మాత్రం "అందరికీ తెలిసిందే కదా" అని సమాధానం దాటవేస్తారు.

అలా దీప్తి సునయన, షణ్ముఖ్ వ్యవహారం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. దీప్తిపై ట్రోలింగ్ వచ్చిన ప్రతిసారీ షణ్ముఖ్ ను కూడా ఆడేసుకుంటారు. షణ్ముఖ్ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు దీప్తిని ఏడిపిస్తుంటారు. అలా ఇప్పుడు దీప్తి సునయన చేసిన పనికి షణ్ముఖ్ ను ఆటపట్టిస్తున్నారు. డాన్స్ ప్లస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో దీప్తి సునయన సెగలు పుట్టించేలా పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కో డాన్సర్ తో హాట్ మూవ్స్, ముద్దులు పెట్టించుకోవ‌డం వంటి విషయాలపై నెటిజన్లు మండిపడ్డారు.

దీప్తి ఆలా రెచ్చిపోవడంతో షణ్ముఖ్ పై మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేశారు. తాజాగా దీనిపై షణ్ముఖ్ స్పందించాడు. రీసెంట్ గా తన ఫాలోవర్లతో ముచ్చటించిన షణ్ముఖ్ కి ''డాన్స్ ప్లస్ షోలో దీప్తి పెర్ఫార్మన్స్ విషయంలో.. మీపై బాగా మీమ్స్ వ‌చ్చిన‌ట్లున్నాయిగా.. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?'' అంటూ ఒక‌త‌ను వెటకారంగా ప్రశ్నించాడు. దీనికి షణ్ముఖ్.. ''కొత్తగా ఏం అనిపించలేదు.. ఇంత కన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది.. ఇవి అన్నీ ఎంత'' అంటూ తన స్టైల్ లో బదులిచ్చాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.