Read more!

English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్ !

కొన్ని వేల సార్లు ప్రోమోల కింద కామెంట్లలో రిషి సర్ రావాలని అభిమానులు కామెంట్లు చేయడం.. అవన్నీ ఫుల్ ట్రెండింగ్ లో ఉండటం.. ఇదంతా గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ చూపించే అభిమానమే. అయితే ఆ అభిమానాన్ని వాడుకుంటూ ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో మలుపుతో ' గుప్పెడంత మనసు' ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగుతుంది.

రిషి సర్ స్క్రీన్ మీద కనపడకుండా దాదాపు నాలుగు నెలల నుండి గుప్పెడంత మనసు సీరియల్ ని నెట్టుకొస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఊహించని మలుపుని ఇచ్చాడు దర్శకుడు కుమార్ పంతం. మను, అనుపమల రాకతో ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుండగా.. రిషి వస్తే ఇక ఈ సీరియల్ టీఆర్పీలో అగ్రస్థానంలో నిలవడం ఖాయమని అందరు భావిస్తున్న తరుణంలో.. రిషి వచ్చేసినట్టుగా కొత్త ప్రోమోని వదిలారు. ఓ అజ్ఞాతవ్యక్తి తన పేరు చెప్పకుండా వసుధారకి కాల్ చేసి.. రిషి సర్ మీ భర్తనా, నాకు ఇప్పుడే కన్పించాడు మేడమ్ మీరు త్వరగా రండి అని చెప్తాడు. ఇక దాంతో వసుధార ఎవరికి చెప్పకుండా రిషిని కలవడానికి వెళ్తుంది. అయితే అక్కడ రిషి ఉండడు. రాజీవ్ వచ్చేసి.. మరదలు పిల్లా అని అంటాడు. అది విని వసుధార షాక్ అవుతుంది. నేను ఇక్కడికి వస్తున్నట్లు నీకెలా తెలుసని వసుధార అనగా.. నీకు ఫోన్ చేసిందే నేనని రాజీవ్ అంటాడు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని వసుధార అడుగగా.. రిషి గాడు తిరిగొచ్చిన వాడిని చంపి నీ మెడలో తాళి కట్టి నిన్ను నా దాన్ని చేసుకుంటానని రాజీవ్ అంటాడు.

ఇక కాసేపటికి వసుధారని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తుంటాడు రాజీవ్. బావ చేయి వదులు అని ఎంత వాదించిన రాజీవ్ వినకుండా తీసుకెళ్తుంటాడు. ఇక సడన్ గా గన్ కాల్చిన శబ్దం, రాజీవ్ వైపుగా వేగంగా వచ్చిన బుల్లెట్ అన్నీ సడెన్ గా జరిగిపోతుంటాయి. ఇక వసుధార, రాజీవ్ ఇద్దరు అటువైపుగా చూస్తారు. ఆ గన్ కాల్చిన వ్యక్తిని చూసి షాకవుతారు. మరి అది రిషీనేనా ? లేక మనునా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉత్కంఠ తెలియాలంటే నేటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు. ఆ గన్ పేల్చింది రిషీనేనా .. కామెంట్ చేయండి.