Read more!

English | Telugu

ఘుమఘుమలాడే పచ్చడి పెట్టిన వంటలక్క...డాక్టర్ బాబు

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. కార్తీక దీపం సీజన్ 2 నవ వసంతం పేరుతో స్టార్ట్ అయ్యి ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక ఈ షో టీమ్ కి గ్రాండ్ గా వెల్కమ్ పార్టీ ఇచ్చింది స్టార్ మా. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబుతో కలిసి చాలా సెగ్మెంట్స్ నిర్వహించింది శ్రీముఖి. "సిరిమల్లె పువ్వా" అనే సాంగ్ కి వంటలక్కను ఉయ్యాలలో కూర్చుని ఊపారు డాక్టర్ బాబు. తర్వాత ఇద్దరికీ వడలు వేసే పోటీ పెట్టింది. పోటీ మాత్రం చాలా హాట్ హాట్ గా జరిగింది. ఇందులో డాక్టర్ బాబు వేసిన వడలు మాత్రం ఫెయిల్ అయ్యాయి.

ఇక ఇద్దరి వడలను  ఒక బౌల్ లో వేసిన చిన్నారి సౌర్య చేత తినిపించింది శ్రీముఖి. ఐతే వంటలక్క వేసిన వడలు బాగున్నాయని చెప్పింది. దాంతో టు గేమ్ రౌండ్స్ లో వంటలక్క టీమ్ గెలిచింది. వీళ్ళిద్దరూ కలిసి ఒకరికి ఒకరు వడలు తినిపించుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ రౌండ్స్ ఐపోయాక తీన్ మార్ తో డైలాగ్స్ చెప్పారు ఈ టీమ్. "ప్రశ్నకు ఉంటుంది జవాబు. ప్రజల ప్రేమకు బానిస ఈ డాక్టర్ బాబు" అంటూ చెప్పాడు. "నీళ్ళల్లో ఉంటుంది చేప..అభిమానుల మనస్సులో ఉంటుంది ఈ దీప" అంటూ కేక పుట్టించే డైలాగ్స్ చెప్పారు. ఈ స్టేజి మీద మామిడి కాయ పచ్చడి పట్టింది దీపక్క. డాక్టర్ బాబు ముక్కలు కొట్టాడు. అన్ని సమపాళ్లలో కలిపి జాడీలోకి పచ్చడి నింపింది. ఇక బేసిన్ లో ఉన్న పచ్చడిలో వేడన్నం, నెయ్యి వేసి కలిపి అందరికీ తలా ముద్దా కలిపి పెట్టింది. అవినాష్ కలిపి నోట్లో ముద్ద పెట్టింది. కారంగా ఉందో ఏమో పచ్చడి ముద్ద తినగానే స్టేజి మొత్తం పరిగెత్తుతూ ఉన్నాడు.