English | Telugu

కాళ్ల‌కు మొక్కిన ఆర్టిస్టులు.. భావోద్వేగానికి గురైన రాశి!

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేస్తోన్న షోలలో 'స్టార్ట్ మ్యూజిక్' షో ఒకటి. బిగ్ బాస్ కంటెస్టెంట్లను, టీవీ ఆర్టిస్ట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చి వారితో రకరకాల టాస్క్ లు చేయిస్తూ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది సుమ. తాజాగా ఈ షోకి 'జానకి కలగనలేదు' టీమ్ వచ్చింది. ఈ సీరియల్ లో సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె భర్తగా, కొడుకుగా అలానే సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారు అతిథులుగా వచ్చారు.

'ఇస్మార్ట్ అమ్మ వర్సెస్ ఇన్నోసెంట్ అబ్బాయి' అంటూ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. గెస్ట్ లను తన ఫన్నీ పంచ్ లతో ఓ ఆట ఆడేసుకున్న సుమ.. ఆ తరువాత రాశిని ఉద్దేశిస్తూ.. 'మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అవుతుందండి' అని ప్రశ్నించింది. దానికి రాశి.. 'నా ఏజ్ ఎంతో అంత' అని చెప్పగా.. 'ఓ.. అయితే నా అంతే' అంటూ కౌంటర్ వేసింది సుమ.

అనంతరం రాశి ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. ఇదే షోలో సెలబ్రేషన్స్ చేశారు. ఆమె లాంటి ఆర్టిస్ట్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కో ఆర్టిస్ట్ లంతా ఆమె ముందు మోకాళ్లపై నుంచొని నమస్కారం పెట్టగా.. భావోద్వేగానికి గుర‌వుతూ వారిని ఆప్యాయంగా హత్తుకుంది రాశి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.