English | Telugu

"అప్పుడే రిటైర్మెంట్ వ‌ద్దు".. సుమ వీడియోపై ఫన్నీ ట్రోల్స్!

యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుంటారో తెలిసిందే. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుమ సందడి చేస్తుంటారు. ప్రతీ రోజూ ఏదొక పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతుంటారు. అలా సోషల్ మీడియాలో సుమ చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. గతేడాది నుండి సుమ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు.

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో తిరిగి వర్క్ లో బిజీ అయ్యారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంట్లో క్యాలెండర్ ను చూస్తూ జూలై 1వ తేదీని మార్క్ చేస్తూ.. ఆరోజు ఎగ్జ‌యిట్‌మెంట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండబోతుందంటూ చెప్పుకొచ్చారు.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫన్నీగా ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దని.. మిమ్మల్ని స్క్రీన్ పై చూడాలనుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ష‌కొత్త ఛానెల్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారా?ష‌ అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో తన కొడుకు సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయి ఉంటుందేమో అని ఎవరికి వాళ్లు ఊహాగానాలు అల్లేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.