English | Telugu

న‌వ్య స్వామితో సుధీర్ పెళ్లి! వీడియో వైర‌ల్‌!!

బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరని చెప్పాలి. ఆయన పెళ్లి మ్యాటర్ ఎప్పటినుండో వైరల్ అవుతోంది. 'జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌత‌మ్‌తో సుధీర్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారని మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఎప్పటికప్పుడు ఈ జంట క్లారిటీ ఇస్తూనే ఉంది. అయితే గతంలో ఓ షోలో భాగంగా సుధీర్, రష్మీలకు రీల్ పెళ్లి చేసేశారు. ఇప్పుడు మరోసారి సుధీర్ కి పెళ్లి చేయడం హాట్ టాపిక్ గా మారింది.

బుల్లితెరపై ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సుధీర్ గా హోస్ట్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ షోలో కమెడియన్స్ సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకొని ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా 'జంబలకడిపంబ' కాన్సెప్ట్ తీసుకొని ఎంటర్టైన్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా.. జంబలకడిపంబ స్టైల్‌తో సాగే ఈ స్కిట్‌ లో సుధీర్ కి సీరియల్ నటి నవ్య స్వామితో పెళ్లి చేసేశారు.

ముందుగా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అబ్బాయి గెటప్ లో రోహిణి 'ఏమైనా పాటలొచ్చా' అని సుధీర్‌ని అడగగా.. 'కనపడిన ప్రతీ ఒక్కరిని అడిగా.. అడిగా అని అడుగుతూనే ఉండేవాడు' అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశాడు. ఆ తరువాత ఈ స్కిట్‌లో ఆటో రామ్‌ప్రసాద్‌, హైపర్‌ ఆది డైల్సాగ్స్‌తో నవ్వించారు. అనంతరం అబ్బాయిలాగా డ్ర‌స్ చేసుకున్న న‌వ్య పెళ్లికూతురుగా ఎంట‌రైంది. "ఈవిడేనా పాపా?" అన‌డిగాడు సుధీర్‌. "ఫ‌ర్లేదు.. అబ్బాయి బాగానే ఉన్నాడు" అంది న‌వ్య‌. "పెళ్లికొడుకును ఏదైనా అడిగేదుంటే ముందే అడుగు" అని న‌వ్య‌తో చెప్పింది రోహిణి. "అడిగేదేముంది.. కోడిన‌డిగి మ‌సాలా నూర‌తామా" అని న‌వ్య అన‌డంతో ఆది బ్యాచ్ షాకైపోయింది.

ఆ త‌ర్వాత‌ సుధీర్ కి, న‌వ్య‌కు పెళ్లి చేసేశారు. న‌వ్య త‌లెత్తుకొని సుధీర్ మెడ‌లో దండ వేస్తే, సుధీర్ త‌ల‌దించుకొని దండ‌ను న‌వ్య చేతికి ఇవ్వ‌గా, ఆమే దాన్ని త‌న మెడ‌లో వేసుకుంది. ప్రస్తుతం ఈ స్కిట్ కు యూట్యూబ్ లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.