English | Telugu

వివాదంపై హైపర్ ఆది క్లారిఫికేష‌న్‌!

'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడని.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆది వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై స్పందించిన ఆయన తను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని.. స్క్రిప్ట్ తను రాసింది కాదని.. తను కేవలం ఆర్టిస్ట్ మాత్రమేనని అన్నాడు.

తెలంగాణ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే బతుకమ్మ పండగ నేపథ్యంలో ఆది ఇటీవల చేసిన స్కిట్ ఇప్పుడు వివాదాలను తీసుకొచ్చింది. ఆదివారం నాడు జరిగిన ఓ షోలో ఈ స్కిట్ ప్రసారమైంది. అందులో "ఉయ్యాలో ఉయ్యాలో.." అంటూ బతుకమ్మ పాట పాడుతూ కమెడియన్లు అందరూ చుట్టూ తిరిగే దృశ్యం ఉంది. బతుకమ్మ పాట మీద కామెడీ చేస్తూ ఈ సన్నివేశాలను నడిపించారు. ఇది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.

తెలంగాణ గ్రామదేవతల పండుగలను, ఇక్కడి ప్రజల యాస భాషలను కించపరిచేలా ఈ స్కిట్ ఉందని, హైపర్ ఆదితో పాటు ఈ స్కిట్ రైటర్, దీన్ని ప్రొడ్యూస్ చేసిన మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైనట్లు తెలియగానే సదరు ఎపిసోడ్‌ను నిర్వాహకులు యూట్యూబ్‌ నుంచి తొలగించారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.