English | Telugu

"సుధీర్ నా బావ".. శ్రీముఖి రచ్చ మాములుగా లేదు!

సుడిగాలి సుధీర్ ఎంట్రీతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షోకి మంచి హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ తో పాటు 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ కంటెస్టెంట్లు' రంగంలోకి దిగడంతో షోకి ఆదరణ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ షోకి గ్లామర్ అద్దడం కోసం బుల్లితెర రాములమ్మ శ్రీముఖిని రంగంలోకి దించేశారు. ఆమె స్టేజ్ పై ఎంటర్ అవ్వగానే సుడిగాలి సుధీర్ ని "బావా" అని వరస కలిపి పిలవడం మొదలుపెట్టింది.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం అవుతున్న‌ ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు సుధీర్, శ్రీముఖి. తాజా ప్రోమోలో సుధీర్ తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. "ఏదైనా ప్రోగ్రాం తెచ్చావా..?" అని ఇమ్మాన్యుయేల్ అడగగా.. "ప్రోగ్రాం కోసం వెళ్లి తలుపులు కొడుతుంటే.. అందరూ నన్ను కొడుతున్నారు సర్" అంటూ పంచ్ వేశాడు. "తలుపు ఎవరు కొట్టమన్నారయ్యా.. బెల్ కొట్టొచ్చు కదా" అంటే.. "బాత్ రూమ్ లకు బెల్ ఉంటుందా..?" అని కౌంటర్ ఇచ్చాడు.

ఆ తరువాత 'ఓ రాములమ్మా.. రాములమ్మా' అనే పాటకు డాన్స్ చేస్తూ ఫ్యాక్షనిస్ట్ లతో ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఫ్యాక్షనిస్ట్ ల ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలా తన పంచ్ లతో రెచ్చిపోయింది. సుధీర్ ని చూపిస్తూ "ఇప్పటినుండి అతను మీకు బావ" అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.