English | Telugu

వంట‌ల‌క్క చ‌చ్చిపోతే.. మిమ్మ‌ల్ని ఊరికే వ‌ద‌లం!

చాలా కాలంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న‌ 'కార్తీకదీపం' సీరియల్. గత కొన్నిరోజులుగా ఈ సీరియల్ ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య వస్తోన్న ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లు ఓ రేంజ్ లో పండుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'కార్తీకదీపం' యూనిట్ కు బెదిరింపులు మొదలయ్యాయి.

దానికి కారణం ఏంటంటే.. కొద్దిరోజులుగా ఈ సీరియల్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీరియల్ లో వంటలక్క క్యారెక్టర్ ను చంపేస్తున్నారని.. ఇకపై ఆమె సీరియల్ లో కనిపించదనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లే రీసెంట్ ఎపిసోడ్స్ లో వంటలక్క ఆరోగ్యం దెబ్బ తినడం, హాస్పిటల్ జాయిన్ చేయడం వంటి సన్నివేశాలను టెలికాస్ట్ చేయడంతో జనాలంతా ఇక హీరోయిన్ ను చంపేస్తారనే అభిప్రాయానికి వచ్చేశారు.

దీంతో స్టార్ మా యాజమాన్యాన్ని, 'కార్తీకదీపం' టీమ్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే 'కార్తీకదీపం' హీరోయిన్ ప్రేమి విశ్వనాధ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది. అందులో ఓ నెటిజన్ 'వంటలక్క చచ్చిపోతే రెండు రాష్ట్రాలు తగలబడిపోతాయ్' అంటూ బెదిరించినట్లుగా మీమ్‌ పోస్ట్ పెట్టాడు. అలానే వంటలక్క క్యారెక్టర్ ను చంపేస్తే స్టార్ మా ఛానెల్ ని ఊరికే వదలం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.