Read more!

English | Telugu

కొన‌సాగ‌నున్న 'పాడుతా తీయగా'.. కొత్త జడ్జ్ ఎవరంటే..

 

ఎంతోమంది సింగర్స్ ను ఇండస్ట్రీకు పరిచయం చేసిన షో 'పాడుతా తీయగా'. దశాబ్దాలుగా ఈ షోకి ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా నడిపిస్తున్నారు ఈటీవీ నిర్వాహ‌కులు. ఈ షోకి ఓ వర్గం ప్రేక్షకులు వీరాభిమానులుగా మారిపోయారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ షోకి ప్రధాన కిరీటం అని చెప్పొచ్చు. ఆయన మరణం తరువాత ఇక ఈ షో ఉండదని అంతా అనుకున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు కాబట్టి షోకి ఫుల్ స్టాప్ పెడతారనే వార్తలు వచ్చాయి. 

అయితే ఇప్పుడు బాలు గుర్తుగా ఈ షోని నడిపించాలని నిర్ణయించుకున్నారు. సంగీతాభిమానుల‌కు ఇది తీపి క‌బురే. ఆయన స్థానంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ను తీసుకురావాలని రామోజీరావు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చరణ్ కూడా దీనికి అంగీకారం తెలిపారని సమాచారం. ఈయనతో పాటు ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్ సునీత కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 

ఈ ముగ్గురి ఆధ్వ‌ర్యంలో 'పాడుతా తీయ‌గా' కొన‌సాగ‌బోతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఎస్పీ చరణ్ తండ్రి పేరుని నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తాలని కోరుకుందాం!