Read more!

English | Telugu

మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్న నోయ‌ల్‌!.. ఆ పోస్ట్ అర్థం అదేనా?

 

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు నోయెల్ చుట్టూ ఎన్నో వివాదాలు అల్లుకొని ఉంటాయి. బిగ్ బాస్ కంటే ముందు.. మొదటి పెళ్లి బ్రేకప్ తో వార్తల్లో నిలిచాడు. ఇక బిగ్ బాస్ షోలో నోయల్ చుట్టూ వివాదాలు బాగానే అల్లుకున్నాయి. తాజాగా నోయల్ చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. నోయల్ ప్రేమ, పెళ్లి, విడాకుల సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఎస్తర్ తో ప్రేమలో పడ్డ నోయల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. 

అదే సమయంలో నోయల్ కి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా హౌస్ లోకి వచ్చిన తరువాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. తన మంచితనంతో అందరికీ దగ్గరయ్యాడు నోయల్. బిగ్ బాస్ హౌస్ లో తన ఫ్యామిలీ గురించి నోయల్ చేసిన కామెంట్స్ అలానే హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు అమ్మ రాజశేఖర్, అవినాష్ ల మీద చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. 

సోషల్ మీడియాలో నోయల్ కి ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా నోయల్ ఓ పోస్ట్ పెడుతూ.. "ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలనుకున్నా" అంటూ రాసుకొచ్చాడు. అంత ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా..?" అంటూ అందరూ ఒకే ప్రశ్నను సంధిస్తున్నారు. కొందరు మాత్రం సినిమా అప్డేట్ అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి నోయెల్ ఏం చెబుతాడో చూడాలి!