English | Telugu

న‌లుగురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న‌ సొహేల్‌!

బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు సొహేల్ ర్యాన్‌. హౌస్ లో ఉన్నంత కాలం 'కథ వేరే ఉంటది' అంటూ రచ్చ చేశాడు. అరియనాతో గొడవలు, అఖిల్ తో స్నేహం, టాస్క్ ల కోసం కష్టపడడం లాంటి విషయాలు సొహేల్‌ ని వార్తల్లో నిలిచేలా చేశాయి. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అత‌డి ఇమేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కి పాతిక లక్షలు వస్తే.. సొహేల్‌ కి మాత్రం నలభై లక్షల వరకు వచ్చింది.

నాగార్జున, చిరంజీవి ఇచ్చిన చెక్కులతో సొహేల్‌ క్రేజ్ బాగా పెరిగింది. అయితే తనకు వచ్చిన ఈ మొత్తంలో ఎక్కువ శాతాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు సొహేల్‌. తాజాగా తన స్వచ్చంద సంస్థ గురించి చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. సొహేల్‌ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పాడు. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తామని అన్నాడు.

కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నట్లు తెలిపాడు. తమ చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి న్యూరో సర్జరీ కాగా.. మరో మూడు హార్ట్ ఆపరేషన్స్ అని.. ఇప్పటివరకు రూ. 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని వివరించాడు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉందని.. కష్టాల్లో ఉన్నవారికి తమ వంతుగా సాయం అందిస్తామని చెప్పాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.