English | Telugu

వాళ్లు వ‌స్తే రానీ.. వాళ్లతో నాకు పోటీ లేదు!

బుల్లితెరపై దాదాపు ఇరవై సీరియల్స్ లో నటించిన లహరి ప్రస్తుతం 'గృహాలక్ష్మీ' సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ లో అమాయకంగా కనిపించే లహరి రియల్ లైఫ్ లో మాత్రం తాను ముక్కుసూటిగా ఉండే అమ్మాయినంటూ కొన్ని విషయాలను పంచుకుంది. ఇప్పటివరకు తను చేసిన అన్ని పాత్రలు నచ్చే చేశానని.. ప్రస్తుతం నటిస్తోన్న 'గృహాలక్షీ' సీరియల్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని,కాబట్టి తన పాత్రకు ఢోకా ఉండదని చెప్పింది. పాత్ర విషయానికొస్తే.. అది డైరెక్టర్ చేతిలో ఉంటుందని.. రేటింగ్ బట్టి మారిపోతుంటుందని.. జనాలకు నచ్చి రేటింగ్ వస్తే ఉంచుతారు లేదంటే లేదని చెప్పింది.

రేటింగ్ బట్టి కథ మారిపోతుందని.. సీరియల్ లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలతో మంచి పేరొచ్చిందని.. జనాలు గుర్తుపట్టి పలకరిస్తుంటార‌ని.. తనను అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక సీరియల్స్ లో కానీ.. రియల్ లైఫ్ లో కానీ చేదు అనుభవాలు లేవని క్లారిటీ ఇచ్చింది. గొడవలకు దూరంగా ఉంటానని.. దేన్నీ సీరియస్ గా తీసుకోనని చెప్పింది. ఎవరైనా గొడవ పెట్టుకోవడానికి వస్తే పక్కకి తప్పుకుంటానని.. అలాంటి వారికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తెలుగు సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం గురించి మాట్లాడుతూ.. తనకు ఆ విషయంలో ఎలాంటి బాధ, బెంగ లేవని చెప్పింది. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి చేసేస్తున్నారు.. నాకు రోల్స్ రావనే భయం తనకు లేదని.. ఎవరు వచ్చినా, వెళ్లినా పట్టించుకోనని.. వాళ్లతో తనకు పోటీ లేదని.. తన రోల్స్ తనకు ఉన్నాయని స్పష్టం చేసింది. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని.. కానీ సీరియల్స్ లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.