English | Telugu

సుధీర్‌కు కన్నుకొడుతూ.. పెదాలు కొరుక్కుంటూ రెచ్చిపోయిన రష్మీ!

బుల్లితెర జోడీ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలలో ఈ జంట చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఈవెంట్ మేనేజర్స్ కూడా ఈ పెయిర్ తో మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఢీ 10' ప్రోమోలో వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అయింది. అందరూ చూస్తుండగానే సుధీర్‌కు కన్నుకొడుతూ రష్మీ రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా యాంకర్ ప్రదీప్ డల్ గా ఉన్న సుధీర్‌ను స్టేజ్ పైకి పిలిచాడు. అతడితో పాటు హైపర్ ఆది కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒకేరకమైన బట్టలు వేసుకొని కనిపించారు. సుధీర్ పర్పుల్ కలర్ వేసుకోవడంతో.. ప్రదీప్ పరుపుల అంటూ సెటైర్ వేశాడు. వెంటనే జడ్జి ప్రియమణి పరుపుల సుధీర్ అంటూ పరువు తీసేసింది. అనంతరం ప్రోమో చివర్లో రష్మీ-సుధీర్ ల రొమాన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అందరూ చూస్తుండగానే డైరెక్ట్ గా సుధీర్‌కి కన్నుకొడుతూ పక్కకు పిలిచింది రష్మీ. అంతేకాదు.. అతని వంక చూస్తూ మునిపంటితో పెదాలు కొరుక్కుంది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రియమణి అయితే నోరెళ్లబెట్టింది. ఇక రష్మీ అలా పిలవడంతో సుధీర్ ప‌ర‌వ‌శంతో మైమ‌ర‌చిపోయాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.