English | Telugu

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం.. వారిద్దరికి తప్ప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -710 లో....కావ్య, యామిని ఇద్దరు గొడవపడతారు రాజ్ ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని యామిని అంటుంది. అది నీ వల్ల కాదని ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్తుంటే రాజ్ కార్ కి సైడ్ ఇవ్వబోయి కిందపడతాడు. చూసుకో బ్రదర్ అంటూ రాజ్ చెప్పి వెళ్తాడు. రాజ్ ని చూసిన కళ్యాణ్ అన్నయ్య అంటూ వెళ్ళబోతుంటే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వచ్చి ఆపుతాడు. లైసెన్స్ ఉందా అంటూ విసిగిస్తాడు అన్ని చూపెట్టేలోపు రాజ్ వెళ్ళిపోతాడు.

అన్నయ్య అయితే బ్రతికే ఉన్నాడు హ్యాపీ కానీ నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు.. అన్నీ కనుక్కోవాలని కళ్యాణ్ అనుకుంటాడు. కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఇంట్లో అందరిని పిలిచి అన్నయ్య బ్రతికే ఉన్నాడు. నాకు కన్పించాడని చెప్తాడు. ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి, సీతారామయ్య మొదట నమ్మరు. ఆ తర్వాత అపర్ణ చెప్పాక అందరు నమ్ముతారు. రాజ్ గతం మర్చిపోయిన విషయం అంతా అపర్ణ చెప్తుంది. వెళ్లి రాజ్ ని తీసుకొని వద్దామని సీతారామయ్య అంటాడు. వద్దు నేనే ఆయన్ని మాములు మనిషిని చేసి తీసుకొని వస్తానని కావ్య చెప్తుంది. ఈ విషయం రాహుల్, రుద్రాణిలకి చెప్పొద్దని ఇందిరాదేవి అంటుంది. వాళ్లకు మాత్రం తెలియొద్దని ప్రకాష్ అంటుంటే మాకెందుకు తెలియొద్దు ఏంటది అంటు రాహుల్, రుద్రాణి ఎంట్రీ ఇస్తారు. ఏం లేదు అంటూ ధాన్యలక్ష్మితో సహా అందరు కవర్ చేస్తారు. అసలు ఏమో జరుగుతుందని రాహుల్, రుద్రాణి అనుకుంటారు.

మరొకవైపు రాజ్ దగ్గరికి యామిని వచ్చి.. తమ ఫొటోస్ తో ఉన్న వెడ్డింగ్ కార్డు ఇస్తుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మా ఫ్రెండ్ వెడ్డింగ్ ఆనివర్సరీ ఫంక్షన్ ఉంది అంటూ యామినికి చెప్పి రాజ్ లగేజ్ తో బయల్దేరతాడు. దాంతో కావ్యకి యామిని ఫోన్ చేసి నీతో వారం రోజులు రిసార్ట్ కి తీసుకొని వెళ్లి రాజ్ ని నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావా అని అంటుంది. నీ ప్లాన్ ని అడ్డుకొని రాజ్ ని నాతో తెచ్చుకుంటానని యామిని అంటుంది. మరొకవైపు నా ఫ్రెండ్ తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నానంటు రుద్రాణి, రాహుల్ కి కావ్య చెప్పి వెళ్తుంది. కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.