English | Telugu

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి తోసేస్తాం!

బుల్లితెర మీద హైపర్ ఆది కంటే అతను వేసే పంచులు ఫుల్ ఫేమస్ అవుతాయి. అలాంటి ఆది రీసెంట్ గా ఒక షోలో తన గురించి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను ఇవతల పక్క పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మాట్లాడినందుకు ఒక 10 మంది సీనియర్స్ నన్ను పైకి తీసుకెళ్లి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి తోసేస్తాం అన్నారు. కానీ ఇప్పటికీ ఆ సప్లిమెంట్స్ రాసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతున్నారు కానీ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసా. ఆ రోజుల్లో ఇలాంటి బెదిరింపులు చాలా ఉండేవి. ఆ తరవాత నా మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఫేక్ పోస్టులు పెట్టడం వంటివి అప్పట్లోనే స్టార్ట్ చేశారు కానీ ఈరోజు కూడా నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాను. నేను ఓన్లీ ఈ షోస్ మాత్రమే కాదు ప్యారలల్ గా పాలిటిక్స్ లో కూడా ఉంటున్నాను కదా అందుకే కొంతమంది నా మీద ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను వచ్చాక ఎన్ని మంచి షోస్ చేసాను ఎంత రేటింగ్ వచ్చింది అనేది మల్లెమాల వాళ్లకు, ఈటీవీ వాళ్లకు తెలుసు అందుకే నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను.

నా వ్యూయర్ షిప్ చెప్తుంది నేనేంటి అనేది. బాడీ షేమింగ్ అంటారు కానీ కోట శ్రీనివాస్ రావు గారు కొన్ని సినిమాల్లో బాబు మోహన్ గారిని ముళ్ళపంది, నల్లపెంకు అంటారు. అది వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్. ఆ కామెడీ అప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా మేమంతా ఎవరి మీద ఎవరు కామెడీ చేయాలనుకున్నా అది ముందే వాళ్లకు చెప్పి అంతా ఓకే అనుకున్నాకే టెలికాస్ట్ వరకు వస్తుంది. ఇంత పద్దతిగా మాట్లాడేవాళ్ళు షిర్డీ సాయి బాబా సినిమాకు ఒక 100 కోట్ల కలెక్షన్ తీసుకురావచ్చు కదా అలాంటి సినిమాలకు ఎవరూ వెళ్ళరు. ఒక స్కిట్ లో అన్ని ఉంటాయి. సోషల్ మీడియా గురించి అస్సలు పట్టించుకోను. పాలిటిక్స్ లో నాకు నచ్చిన నాయకుడికి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తాను" అని చెప్పాడు ఆది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.