Read more!

English | Telugu

ఫస్ట్ రెమ్యూనరేషన్ వెయ్యి...ఇప్పుడు లక్ష

భానుశ్రీ అంటే చాలు బాహుబలి మూవీ గుర్తొస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చాక బిగ్ బాస్ భానుశ్రీగా మారిపోయింది. మూవీస్ చేసినా రానంత గుర్తింపు బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఆ తర్వాత బాహుబలి మూవీలో చేసాక వచ్చింది. మొదటి వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించినా భానుశ్రీ హౌస్ లో నాలుగు వారాలకు మించి ఉండలేకపోయింది. భాను శ్రీ మంచి డాన్సర్. ఇక భానుశ్రీ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

"ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా పేమెంట్ వెయ్యి రూపాయలు...ఇప్పుడు లక్ష రూపాయలు. వెయ్యి రూపాయలు తీసుకోవడం నిజంగా నాకు గొప్ప మెమరీ. ఇండస్ట్రీకి వచ్చి డాన్సర్ కార్డు తీసుకున్నాక ఎవరో నాకు ఒక షో గురించి చెప్పారు. ఒక పెర్ఫార్మెన్స్ చేయాలి. దానికి వెయ్యి రూపాయలు అన్నారు. ఒక వినాయక చవితి ఈవెంట్ లో గ్రూప్ డాన్సర్స్ లో నేను ఒకదానిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు డాన్స్ చేస్తున్నారు. ఎవరో కొరియోగ్రాఫర్ లీడ్ చేస్తున్నారు. నా వెనక వినాయక విగ్రహం ఉంది. అలా స్వామికి నేను నా కెరీర్ స్టార్ట్ చేస్తున్నా అని దణ్ణం పెట్టుకుని ఆ షో చేసాను. ఫస్ట్ టైం  వెయ్యి రూపాయలు ఇచ్చారు. అందులోనూ వంద రూపాయలు కట్ చేసుకుని 900 లు ఇచ్చారు. ఇప్పుడు ఏ షోకైనా లక్ష తీసుకుంటున్నా..అది కూడా ఆ ఈవెంట్ ని బట్టి పేమెంట్ తీసుకుంటున్నా. బాహుబలి మూవీలో చేయడం వల్లనే నాకు గుర్తింపు వచ్చింది. మా ఊరికి తీసుకెళ్లి నాకు సన్మానం కూడా చేశారు. హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు ఆగిపోయాయి. కొన్ని పేమెంట్స్ ఇచ్చారు కొన్ని ఆపారు.