English | Telugu

శ్రీ‌ముఖి గోవా టూర్ ఖ‌ర్చు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఇటీవ‌ల బుల్లితెర స్టార్స్ శ్రీ‌ముఖి, ముక్కు అవినాష్‌, అరియానా, విష్ణు ప్రియ గోవా వెళ్లి అక్క‌డి బీచ్‌లో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. శ్రీ‌ముఖి మాత్రం వీరంద‌రికి భిన్నంగా వాట‌ర్ బేబీ‌గా మారి త‌డిసిన డ్రెస్సుల్లో ఓ రేంజ్‌లో అందాల క‌నువిందు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో ఇన్ స్టా వేదిక‌గా పంచుకుని మురిసిపోయింది.

విష్ణుప్రియ.. శ్రీ‌ముఖితో పోటీప‌డి ఎంజాయ్ చేసింది. ఇక ముక్కు అవినాష్ కూడా అదే స్థాయిలో అరియానాలో క‌లిసి ర‌చ్చ చేశాడు. కానీ అరియానా మాత్రం రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా ఈ అకేష‌న్‌ని సెల‌బ్రేట్ చేసుకుంది. శ్రీ‌ముఖి గ్లామ‌ర్ షో ఈ టూర్‌కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అయితే వీరంతా ఒకేసారి గోవా వెళ్ల‌డానికి అస‌లు కార‌ణం వేరే వుంద‌ని తెలిసింది.

`కోలా గోవా బీచ్ రిసార్ట్‌`ని ప్ర‌మోట్ చేయ‌డంలో భాగంగా వీరిని స‌ద‌రు రెస్టారెంట్ నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా ఆహ్వానించారట‌. అందులో భాగంగానే `కోలా గోవా బీచ్ రిసార్ట్‌` ద్వారం వ‌ద్ద పేరు క‌నిపించేలా శ్రీ‌ముఖి, విష్ణుప్రియ ప్ర‌త్యేకంగా ఫొటోల‌కు పోజులిచ్చారు. ఈ టూర్‌కి సంబంధించిన ఖ‌ర్చు మొత్తం వారిదే కావ‌డంతో ఈ సీక్రెట్ తెలిసి మిగ‌తావారంతా అవాక్క‌వుతున్నారు‌.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.