English | Telugu

కోర్టు నోటీసులు.. సౌంద‌ర్య టెన్ష‌న్‌‌.. దీప ఆనందం!

'కార్తీక దీపం'లో ఇంత కాలంగా సాగుతున్నఎపిసోడ్‌ల‌లో కంట‌నీరు పెట్టిన వంటల‌క్క తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో న‌వ్వుతూ చ‌లాకీగా క‌నిపిస్తోంది. వంటల‌క్క న‌వ్వు వెన‌కున్న ధైర్య‌మేంటీ? మోనిత అస‌లు గుట్టు దీప చేతికి చిక్కిందా? అని స‌గ‌టు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా వుంటే గురువారం ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబుకు దీప‌ మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది. కార్తిక్‌తో విడాకుల‌కు అప్లై చేసిన దీప ఆ కేసుని హిమ కేసుతో లింక్ పెట్టేసి మోనిత అస‌లు రంగు బ‌ట్ట‌బ‌య‌లు చేసే మ‌హ‌త్త‌ర ప్లాన్ కు శ్రీ‌కారం చుట్టింది. ఇదే విష‌యం ఈ రోజు రివీల్ ‌కాబోతోంది. స‌రోజ తెచ్చిన విడాకుల నోటీసులు అందుకున్న దీప అంతులేని సంతోషంతో "జీవితంలో విడాకులు అడ‌క్కుండా చేయ‌డానికి నాకు దొరికిన‌ అవ‌కాశం" అంటుంది.

క‌ట్ చేస్తే కోర్టు నోటీసులు సౌంద‌ర్య చేతికి అందించి న‌వ్వుతూ నిల‌బ‌డుతుంది దీప‌. విడాకుల నోటీసులు చూసి సౌంద‌ర్య టెన్ష‌న్ ప‌డుతుంటే దీప మాత్రం ఆనందంతో న‌వ్వుతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. "ఏంటీ? ఏం జ‌రుగుతోంది?" అని కంగారుగా అడిగిన సౌంద‌ర్య‌కు దీప ధైర్యం చెబుతుంది. "కొండంత అండ‌గా నిల‌బ‌డే మీరే ఇలా బెదిరిపోతే ఎలా?" అంటుంది దీప. అయినా సౌంద‌ర్య‌లో భ‌యం వీడ‌దు. ఇంత‌కీ దీప ధైర్యం ఏంటీ? దాని వెన‌కున్న అస‌లు సీక్రెట్ ఏంట‌న్న‌ది తెలియాలంటే 'కార్తీక‌ దీపం' గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.