English | Telugu

అప్పుడే స‌గం చ‌చ్చిపోయా : సాయి కిర‌ణ్‌

త‌రుణ్ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం `నువ్వే కావాలి`. ఇదే సినిమాతో సెకండ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యారు సాయికిర‌ణ్‌. కానీ హీరోగా మాత్రం రాణించ‌లేక‌పోయారు. 25కు పైగా చిత్రాల్లో హీరోగా న‌టించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో సాయికిర‌ణ్ గ‌త కొంత కాలంగా బుల్లితెర‌పై రాణిస్తున్నారు. తండ్రి పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయారు. కోయిల‌మ్మ‌.., ఇంటి గుట్టు... గుప్పెడంత మ‌న‌సు వంటి ధారావాహిక‌ల్లో న‌టిస్తున్నారాయ‌న‌.

ఇంటి గుట్టులో తండ్రిగా న‌టిస్తున్న సాయి కిర‌ణ్ అదే త‌ర‌హా తండ్రి పాత్ర‌ని `గుప్పెడంత మ‌న‌సు`లో న‌టిస్తున్నా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ మూడు సీరియ‌ల్స్‌ల‌లో ఇంటి గుట్టు, గుప్పెడంత మ‌న‌సు మంచి రేటింగ్‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్త్యూలో సాయికిర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. త‌న‌కు బుల్లితెర‌పై గుర్తింపుని తెచ్చిన `కోయిల‌మ్మ‌` సీరియ‌ల్‌ని అర్థాంత‌రంగా ఆపేయ‌డంతో స‌గం చ‌చ్చిపోయాన‌న్నారు.

ఈ సీరియ‌ల్‌లో సింగ‌ర్ మ‌నోజ్ కుమార్‌గా న‌టించా. అది నా మ‌న‌సుకు చాలా ద‌గ్గ‌రైన పాత్ర‌. ఇదే సీరియ‌ల్‌ని మ‌ల‌యాళంలోనూ ఏక కాలంలో చేశా. కానీ రెండు భాష‌ల్లోనూ ఈ సీరియ‌ల్‌ని ఒకేసారి ఆపేయ‌డంతో స‌గం చ‌చ్చిపోయా ` అన్నారు సాయి కిర‌ణ్‌. త‌న కెరీర్‌లో `కోయిల‌మ్మ` సీరియ‌ల్ పెద్ద మైలు రాయిగా నిలిచింద‌ని అలాంటి సీరియ‌ల్‌ని మ‌ధ్య‌లోనే ఆపేయ‌డంతో త‌ట్టుకోలేక‌పోయాన‌న్నారు సాయికిర‌ణ్‌