English | Telugu

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు ఎమోష‌న‌ల్ అయిన డాక్టర్ బాబు భార్య! ఆ ప్ర‌శ్నేమిటంటే...

బుల్లితెర ప్రేక్షకులకు 'కార్తీక దీపం' ఫేమ్ నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు. 'చంద్రముఖి' సీరియల్ తో వీరిద్దరి ప్రయాణం మొదలైంది. షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. నిరుపమ్ భార్యగా మంజులకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ఓ సీరియల్ చేస్తే చూడాలని అభిమానులు ముచ్చట పడుతున్నారు.

'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ తో త్వరలోనే మంజుల ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో మంజుల కన్ఫర్మ్ చేసింది. నిరుపమ్ తో కలిసి ఎప్పుడు నటిస్తారని నెటిజన్ ప్రశ్నించగా.. దానికి మంజుల 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ తో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు తెలిపింది. తాజాగా మరోసారి ఆమె తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు.

ఈ క్రమంలో 'అదా..? ఇదా..?' రెండింటిలో ఏదొకటి సెలెక్ట్ చేసుకోవాలనే ఆట ఆడారు. దీంతో నెటిజన్లు రకరకాల ప్రశాలు అడిగారు. "డాక్టర్ బాబు అంటే ఇష్టమా..? హిట్లర్ అంటే ఇష్టమా..?", "బెంగళూరా..? హైదరాబాదా..?" అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు. తనకు హిట్లర్ అంటే ఇష్టమని, బెంగళూరు అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ "భర్తా..? కొడుకా..?" అని అడిగాడు. దానికి ఆమె ఇద్దరినీ వేరు చేయలేనని.. అలా చేసిన రోజు నా ఊపిరి ఆగిపోతుందని ఎమోషనల్ అయింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.