English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ.. మోస్ట్ డిజైర‌బుల్ ఉమ‌న్ ఆన్ టీవీ!

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి వ‌డ్త్య‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ టైమ్స్ ఎంపిక చేసిన 2020 సంవత్సరంలో టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిభను చాటిన సెలబ్రిటీల జాబితాలో దివికి చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా ఎంపికయ్యావంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి కాల్ రావడం గొప్ప అనుభవమని.. అలాంటి కాల్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పింది.

ఆ వార్త వినగానే నమ్మలేకపోయానని.. యాక్సెప్ట్ చేయడానికి కాస్త సమయం పట్టిందంటూ దివి తెలిపింది. ఇతర నటీనటుల కంటే భిన్నంగా ఉండ‌టానికి తన అందం మాత్రమే కారణం కాదని.. తన క్యారెక్టర్ ను ఇష్టపడి ప్రజలు అభిమానిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ ఘనతను సాధించడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని.. ఎంతో ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇటీవల స్పార్క్ ఓటీటీలో రిలీజైన 'క్యాబ్ స్టోరీస్'లో దివి నటించింది. ఈ సిరీస్ లో తన నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపింది. చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించినట్లు.. అలానే కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దివి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ టైటిల్‌ను సొంతం చేసుకొన్న క్రమంలో ఈమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.