English | Telugu

చీర‌లో ర‌ష్మి తీన్మార్ స్టెప్పులు.. అద‌రిపోయిన స్టేజీ!

లేటెస్ట్ గా విడుదలైన 'ఢీ' షోకి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం కంటెస్టెంట్ ల టెరిఫిక్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఒకటి కాగా.. చీర కట్టుకొని యాంకర్ రష్మీ వేసిన తీన్మార్ స్టెప్పులు ఇంకొక కారణమని చెప్పాలి. ఈ షోలో సుధీర్ తో కలిసి రష్మీ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ, దీపికా పిల్లి కాలేజ్ సీనియర్స్ గా.. సుధీర్, ఆది వాళ్ల జూనియర్స్ గా కనిపించి ఫన్ క్రియేట్ చేశారు.

ముందుగా మీ పేర్లేంటి అని రష్మీ ప్రశ్నించగా.. ఆది తనను ఆదమ్మగా, సుధీర్ ని సూదమ్మగా పరిచయం చేశాడు. ఆ సమయంలో షోలో ఉన్నవాళ్ళంతా తెగ నవ్వుకున్నారు రష్మీ.. సుధీర్ ని ర్యాగింగ్ చేసే క్రమంలో కొన్ని పంచ్ లు బాగా పేలాయి. ''నువ్ ఫ్రెషరా..?'' అని రష్మీ.. సుధీర్ ని ప్రశ్నించగా.. ''హా ఫ్రెష్'' అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. ఆ తరువాత 'మీ ఊర్లో ఏం చేస్తుంటారని' రష్మీ అడిగితే.. 'విత్తనాలు వేస్తుంటామ్' అని చెప్పాడు సుధీర్. 'నువ్ విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారు' అని రష్మి అడగ్గా.. "మా అక్కే సూదమ్మ" అని పంచ్ వేశాడు హైపర్ ఆది.

ఇక ప్రోమో చివర్లో తీన్మార్ దరువుకి రష్మీ వేసిన స్టెప్పులు మాములుగా లేవు. చీరకట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న రష్మీ.. చెంగు మడిచి మాస్ స్టెప్పులు వేసి స్టేజ్ ని షేక్ చేసేసింది. ఆమె డాన్స్ కి అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. చివరకు చీర చెంగుని తీసుకొని ఏమీ తెలియదన్నట్లుగా సైలెంట్ గా వెళ్లి కూర్చొని.. తన ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.