English | Telugu

జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించిన 'కార్తీకదీపం'!

రోజురోజుకి 'కార్తీకదీపం' సీరియల్ ను మరింత ఉత్కంఠ కలిగించేలా రూపొందిస్తున్నారు. దీంతో ఈ సీరియల్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో అయితే ఈ సీరియల్ కు పోటీగా మరే సీరియల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతుంది. ఇప్పటికే బుల్లితెర చరిత్రలో అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇప్పుడు మరో రికార్డును దక్కించుకుంది. ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ సాధించిన సీరియల్ గా రికార్డులు సృష్టించింది.

అయితే ఈ నెంబర్ వన్ స్థానం 'కార్తీకదీపం' సీరియల్ కు ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ సీరియల్.. ఈ వారం 21.01 టీఆర్పీ సాధించి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంది. అంతకుముందు 20.07 ఉన్న టాప్ టీఆర్పీ రేటింగ్ ను బ్రేక్ చేసింది. అయితే ఈ విషయాన్ని నిరుపమ్ పరిటాల ఫ్యాన్స్ పేజ్‌లో అభిమానులు షేర్ చేయగా.. దీన్ని ప్రేమి విశ్వనాథ్ తన ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇక ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. ఇన్నాళ్లు అనుమానంతో దీపను దూరం పెట్టిన డాక్టర్ బాబు ఇప్పుడిప్పుడే ఆమె నిజాయితీను తెలుసుకొని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో కథలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. మోనిత తను గర్భవతినని దానికి కారణం కార్తీక్ అంటూ అందరి ముందు చెప్పింది. దీంతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఒక్క పాయింట్ తో మరో మూడేళ్లు సీరియల్ నడిపించినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.