English | Telugu

రష్మీతో సుధీర్ లాంగ్ డ్రైవ్!

బుల్లితెరపై యాంకర్ రష్మీతో కలిసి సుధీర్ చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జంటకి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. బుల్లితెరపై ఈ జంట పండించే కెమిస్ట్రీకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. కానీ తెర వెనుక మాత్రం మేమిద్దరం స్నేహితులు మాత్రమేనని చెబుతుంటుంది ఈ జంట. ఇప్పటివరకు 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోలో ఈ జంట ప్రేమ, పెళ్లి అంటూ చాలా స్కిట్లు చేశారు. తాజాగా మరో స్కిట్ చేశారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ జంట నిజమైన ప్రేమికుల్లానే అందరినీ నమ్మించారు. ఈ స్కిట్లో రష్మీ లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నట్లు పెట్టిన స్టేటస్ చూసి సుధీర్ కూడా రెడీ అవుతాడు. ఆమె వెళ్లేదారిలో కాచుకొని.. ఆమెని లిఫ్ట్ అడుగుతాడు. "ఎటు వెళ్తున్నావ్ రష్మీ.. ఈ దారిలో నువ్వేంటి..?" అని ఏమీ తెలియనట్లుగా అడిగితే.. "కూరగాయలు కొనడానికి వెళ్తున్నా" అని రష్మీ బదులిస్తుంది. దానికి సుధీర్ "అదేంటి స్టేటస్ లో లాంగ్ డ్రైవ్ అని పెట్టావ్ కదా..?" అని అడుగుతాడు.

దానికి రష్మీ "స్టేటస్ చూసే వచ్చావ్ కదా మరి ఎందుకు ఓవరాక్షన్!" అంటూ కౌంటర్ వేస్తుంది. అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తోన్న సమయంలో "బాగా ఉక్కబోస్తుంది.. డోర్ తీసి ప్రపంచాన్ని చూడు." అని సుధీర్ కి సలహా ఇస్తుంది రష్మీ. "నేను ప్రపంచాన్నే చూస్తున్నాను." అంటూ రష్మీ వంక ఆరాధ‌న‌గా చూస్తూ చెబుతాడు సుధీర్. దానికి ఆమె తెగ సిగ్గుపడిపోతుంది. ఈ ప్రోమో చివర్లో నిర్వాహకులు వీరి ప్రేమను ఎలివేట్ చేస్తూ కొన్ని కొటేషన్స్ కూడా రాశారు. ఈ ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.