English | Telugu

నెటిజన్‌కు ఫోన్ నంబర్ ఇచ్చిన డాక్టర్ బాబు భార్య! ఆ నంబ‌ర్‌కు కాల్ చేస్తే...

'చంద్రముఖి' సీరియల్ లో కలిసి నటించిన నిరుపమ్, మంజుల నిజజీవితంగా ఒక్కటయ్యారు. వీరికో కుమారుడు కూడా ఉన్నాడు. నిరుపమ్ కి 'కార్తీకదీపం' సీరియల్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. డాక్టర్ బాబు భార్యగా మంజులకు కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. మంజుల, నిరుపమ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ అభిమానులతో టచ్ లో ఉంటూ పాపులారిటీ పెంచుకుంటున్నారు.

తమ వ్యక్తిగత విషయాలను, ఫోటోలను షేర్ చేస్తూ.. రీల్ వీడియోలతో హడావిడి చేస్తుంటారు. తాజాగా మంజుల తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో నెటిజన్లు ఆమెని రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా ఆమె భర్త నిరుపమ్, చెల్లెలు కీర్తి గురించి అడిగారు. ఓ నెటిజన్ మాత్రం ఏకంగా మంజుల ఫోన్ నెంబర్ అడిగేశాడు. దీనికి ఆమె నేరుగా నంబర్ షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు షాకయ్యారు.

అయితే ఆమె ఇచ్చిన నెంబర్ తన పర్సనల్ నెంబర్ కాదు. అది అసలు ఫోన్ నెంబరే కాదు. 9 నుండి వరుసగా వెనక్కి జీరో వరకు రాసుకొచ్చారు. అలా నెంబర్ రూపంలో ఉన్న ఫేక్ నెంబర్ ఇచ్చింది మంజుల. ఆమె సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ లో నటిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.