English | Telugu

రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ...నా ప్రాణం నిలిపారు

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షో ఫైనల్స్ కి వచ్చేసింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ షోకి మంచు లక్ష్మి, నటి రోజా వచ్చారు. ఈ షోకి డిటెక్టీవ్ గెటప్ లో పంచ్ ప్రసాద్ వచ్చాడు. రవి అతన్ని చూసి "అసలు నువ్వొచ్చిన పనేంటి" అని అడిగాడు. "నేను డిటెక్టీవ్ ని" అన్నాడు. "ఐతే ఆమె షూస్ , అతని సాక్స్ పోయాయట..అవి కనుక్కో ఫస్ట్" అన్నాడు ప్రసాద్.."సరే ఏదో ఒకటి చెయ్యి ఫస్ట్" అన్నాడు రవి.. "కుడి చెయ్యా ఎడమ చెయ్యా" అని ప్రసాద్ అనేసరికి "ఛి నేనెళ్ళి కూర్చుంటా" అని అష్షు వెళ్ళిపోయింది. ప్రసాద్ తన భార్య ఫోటో చూపించేసరికి రోజా " ఫస్టా, సెకండా, థర్డ్ ఆ" అని అడిగింది. తర్వాత రవి "ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరితో మాట్లాడ్డానికి" అని అడిగాడు.

వెంటనే ప్రసాద్ ఒక రోజా పిక్చర్ తీసి చూపించేసరికి రోజా నవ్వేసింది. "ఈరోజు ఇంత హ్యాపీ లైఫ్ ని భార్యా పిల్లలతో లీడ్ చేస్తున్నాను అంటే మేడం మీరు పెట్టిన బిక్షే మేడం. నిజం చెప్తున్నా మేడం నాకు మా అమ్మ ప్రాణం పోస్తే నా భార్య పునర్జన్మ ఇస్తే రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ" అంటూ కాళ్ళ మీద పడ్డాడు ప్రసాద్. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో అమ్మాయిగారు - పడమటి సంధ్యారాగం వెర్సెస్ చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ టీమ్స్ మధ్యన ఈ పోటీ జరిగింది. ఇక రోజా ఫస్ట్ ఎపిసోడ్ లో చేసిన ఉప్మా ఛాలెంజ్ లో ఉప్మాన్ని అస్సలు మర్చిపోలేదంటూ చెప్పాడు రవి. "నేను చేసిన ఉప్మా తిన్న వాళ్ళు గెలిచారు చూసారుగా" అంది రోజా. దానికి ప్రభాకర్ కౌంటర్ వేసాడు. "అది ఉప్మా కాదురా...అది బోండాలా ఉన్న ఉప్మా" అన్నాడు. ఇక మంచు లక్ష్మి అమ్మాయిగారు - పడమటి సంధ్య రాగం టీమ్స్ ని లీడ్ చేసింది. రోజా చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు టీమ్స్ ని లేదా చేశారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.