English | Telugu

మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీవీ స్టార్‌ అరెస్ట్!

ఈ మధ్య కాలంలో హిందీ టెలివిజన్ రంగాన్ని పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. రీసెంట్ గా నటుడు కరణ్ మెహ్రా తన భార్యను వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి, బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే మరో టీవీ స్టార్ యాక్ట‌ర్‌ అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. 'నాగిన్ 3' సీరియల్ తో పాపులారిటీ తెచ్చుకున్న పెరల్ వి పురి అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. అత‌డిని పోలీసులు 'పోక్సో' (ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్ర‌మ్ సెక్సువ‌ల్ అఫెన్సెస్‌) సెక్ష‌న్ కింద‌ అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం బాలీవుడ్ వ‌ర్గాల‌ను షాక్‌కు గురిచేశాయి.

వివరాల్లోకి వెళితే.. ఇది పాత కేస‌నీ, టీవీ సీరియ‌ల్స్‌లో అవ‌కాశాలు ఇప్పిస్తున్నానని ప్రామిస్ చేసి, మైన‌ర్ బాలిక‌ను లైంగికంగా వాడుకున్నాడ‌నేది పెర‌ల్ వి పురిపై ఉన్న అభియోగ‌మ‌నీ పోలీసులు తెలిపారు. అత‌డిని రాత్రి ముంబైలోని వాలివ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్లుగా టీవీ సీరియ‌ల్స్‌లో న‌టిస్తోన్న పురి, ఆ మైన‌ర్ బాలిక‌తో స‌న్నిహితంగా మెల‌గుతూ వ‌స్తున్నాడ‌ని వారు చెప్పారు. అత‌డిని పోలీస్ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

కాగా 'నాగిన్ 3'లో పురితో క‌లిసి న‌టించిన అనిత (నువ్వు నేను హీరోయిన్‌) అత‌డికి మ‌ద్ద‌తుగా నిలిచింది. పెర‌ల్ మంచివాడంటూ దీన్ని నాన్‌సెన్సిక‌ల్ న్యూస్‌గా అభివ‌ర్ణించింది. అత‌డి గురించి త‌న‌కు బాగా తెలుస‌నీ, ఇలాంటి ప‌నులు చేసేవాడు కాద‌నీ అనిత చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.