English | Telugu

అషురెడ్డి స్మార్ట్ వాచ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ డీపీ!

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డికి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆమె కావాలని అలాంటి కామెంట్స్ చేస్తుందో లేక ఆమెచేసే కామెంట్స్ కాంట్రవర్సీ అవుతుంటాయో తెలియదు కానీ అషురెడ్డి మాత్రం ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. అది రాహుల్ సిప్లిగంజ్ విషయమైనా సరే.. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అయినా సరే.. అషురెడ్డి వ్యవహారం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.

పవన్ కళ్యాణ్ అంటే అషురెడ్డికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అప్పట్లో పవన్ తో దిగిన ఫోటోపై నెటిజన్లు చేసిన కామెంట్స్ కి అషురెడ్డి ఇచ్చిన కౌంటర్లు అంత ఈజీగా మర్చిపోలేం. 'హరిహర వీరమల్లు' షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన అషురెడ్డి ఆయ‌న‌తో ఫోటో తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయింది. పవన్ కి నాల్గో భార్యగా ఉంటావా..? అని ఓ నెటిజన్ కామెంట్స్ చేస్తే.. దానికి ఆమె ఉంటానంటూ రిప్లై ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అయితే ఆ ఫోటోను అషురెడ్డి ఎంతో జాగ్రత్తగా దాచుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతీ క్షణం కంటికి కనిపించేలా పెట్టుకుంది. చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకున్న అషురెడ్డి.. దాంట్లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలు డీపీ (డిస్‌ప్లే ఫొటో)గా పెట్టుకుంది. తాజాగా తన పెట్ తో ఉన్న వీడియోను అషురెడ్డి షేర్ చేయగా.. అందులో ఈ డీపీ కనిపించింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను అషురెడ్డి ఈ విధంగా చాటుకుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.