English | Telugu

తండ్రి మరణాన్ని తలచుకుంటూ నిరుప‌మ్ భావోద్వేగం!

నిరుపమ్ పరిటాల అంటే ఎక్కువ‌మందిగుర్తుకుపట్టక పోవచ్చు కానీ అదే డాక్టర్ బాబు అనగానే ఇట్టే గుర్తుపడతారు. అంతలా అతడిని పాపులర్ చేసింది 'కార్తీక దీపం' సీరియల్. దివంగత నటుడు, రచయిత అయిన ఓంకార్ గారి కుమారుడే ఈ డాక్టర్ బాబు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు కొన్ని పర్సనల్ విషయాలను పంచుకున్నారు. తను విజయవాడలో పుట్టినప్పటికీ.. పెరిగింది మాత్రం చెన్నైలోనని.. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నట్లు నిరుపమ్ చెప్పారు.

తను బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని అమ్మానాన్నలు కోరుకునేవారని.. కానీ తనకు మాత్రం యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ ఉండేదని.. అదే విషయాన్ని ఓ రోజు తన తండ్రికి చెబితే.. ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదని తెలిపారు. తన తల్లి అయితే ఏడ్చి గోల చేసేసిందని.. కానీ తన తండ్రి మాత్రం సపోర్ట్ చేసి తన ఇష్టప్రకారమే చేయాలనుకున్నారని చెప్పారు. అదే సమయంలో ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడంతో.. తన తండ్రి కూడా ఫ్యామిలీను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలనుకున్న విషయాన్ని చెప్పారు.

రైటర్ గా, నటుడిగా సీరియల్స్ చేస్తూ తన తండ్రి చెన్నైలో చాలా బిజీగా ఉండేవారని.. కానీ తన కోసం అక్కడి అవకాశాలను వదులుకొని హైదరాబాద్ రావడానికి సిద్ధపడ్డారని ఎమోషనల్ గా చెప్పాడు. హైదరాబాద్ లో ఇల్లు చూసుకొని షిఫ్ట్ అవ్వాలన్న సమయంలో తన తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోయారని.. ఆయన చనిపోవడంతో తనకు ఏం చేయాలో కూడా తోచలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను నటుడిగా చూడాలనే కోరిక తీరకుండానే ఆయన చనిపోయారని.. అది చాలా దుదృష్టకరమని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.