English | Telugu

"న‌న్ను చాలా మంది తిడుతున్నారు".. వాపోయిన డాక్ట‌ర్ బాబు!

బుల్లితెరపై హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు 'కార్తీకదీపం' డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో పాటు 'హిట్లర్ గారి పెళ్లాం' అనే మరో సీరియల్ కూడా చేస్తున్నారు. అయితే నిరుపమ్ ఎక్కడికి వెళ్లినా.. 'కార్తీకదీపం' సీరియల్ గురించే అడుగుతుంటారట. వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మోనిత ప్రెగ్నెంట్ న్యూస్ తో మరింత ఆసక్తికరంగా మారింది.

దీప, కార్తిక్ లు కలుస్తారనుకునే సమయంలో మోనిత ఇచ్చిన ట్విస్ట్ తో సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నెటిజన్లు ఈ సీరియల్ కు ముగింపు ఉండదా..? దీప, కార్తిక్ లు ఎప్పుడు కలుస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై చాలా మంది తనను తిడుతున్నారని.. పర్సనల్ మెసేజ్ లు కూడా పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.

ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కార్తీకదీపం' సీరియల్ గురించి మాట్లాడారు. ఈ సీరియల్ ఇంత క్లిక్ అవుతుందనుకోలేదని అన్నారు. వంటలక్క క్యారెక్టర్ విన్నప్పుడు సక్సెస్ ఫార్ములా కాబట్టి నమ్మకం ఏర్పడిందని.. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదని చెప్పారు. మీమ్స్, ట్రోల్స్ చూసినప్పుడు నవ్వుకుంటానని.. తిట్టినప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటానని అన్నారు. తనకు పర్సనల్ గానే చాలా మంది మెసేజ్‌లు పెట్టి తిడుతుంటారని... ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోనని అన్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.