English | Telugu
వంటలక్క కాదు ఫొటోలక్క.. నిరుపమ్ సెటైర్లు!
Updated : Jul 5, 2021
బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సీరియల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీరియల్‌లో నటించే తారలంతా ప్రేక్షకులు దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో 'కార్తీకదీపం' సీరియల్ హల్చల్ చేస్తుంటుంది. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ తన నటనతో మెప్పిస్తుంటే.. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ ఓ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తోంది.
ఈ జంట ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిరుపమ్ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. తనదైన స్టైల్‌లో సెటైర్లు, పంచ్‌లు వేస్తూ అలరిస్తుంటారు. తన మీద, 'కార్తీకదీపం' సీరియల్ మీద వచ్చే మీమ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
ఆదివారం అయితే మాములుగా అందరూ ఇంటిపట్టునే ఉంటారు. షూటింగ్‌లు ఏవీ పెద్దగా ఉండవు. కానీ 'కార్తీకదీపం' యూనిట్ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందట. ఆదివారం కూడా షూటింగ్ పెట్టడంతో కోపంగా ఉన్నానని చెప్పిన నిరుపమ్.. వంటలక్క మాత్రం ఫోటోలు తీస్తూ.. ఫొటోలక్కగా మారుతుందేమో అని కౌంటర్ వేశారు. వంటలక్క తీసిన ఫోటోలో నిరుపమ్ బుంగమూతి పెట్టుకొని కనిపించారు.