English | Telugu

నిరుపమ్ పరిటాల ఖాతాలో పెద్ద బ్రాండ్

బుల్లితెరపై నిరుపమ్ పరిటాలది మెగాస్టార్ రేంజ్. సూపర్ డూపర్ హిట్ 'కార్తీక దీపం' సీరియల్‌తో అతడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది. ప్రజలలో అతడికి ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని అడ్వర్టైజ్‌మెంట్ ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో అతడి చేత తమ తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకోవాలని పెద్ద పెద్ద బ్రాండ్స్ ముందుకు వస్తున్నాయి.

స్టార్స్‌తో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో తమ ప్రోడక్ట్ గురించి చెప్పిస్తూ వీడియో, ఫొటోలు పోస్ట్ చేయించడం లేటెస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ ట్రెండ్. ఇంతకు ముందు నిరుపమ్ గ్రీన్ టీకి చెందిన ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేశాడు. అయితే, ఈసారి అతడి ఖాతాలో పెద్ద బ్రాండ్ పడింది.

పేటీయమ్ అంటే ఈ రోజుల్లో తెలియనివారు ఎవరూ ఉండరు. అటువంటి పేటీయమ్ కూడా నిరుపమ్ పరిటాలతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయించుకుంటోంది. గ్రామీణ ప్రాంతాలకు, సీరియల్ వీక్షకులకు కూడా చేరువ కావడం కోసం నిరుపమ్ పరిటాలను ఎంపిక చేసుకుందని సమాచారం.