English | Telugu

"ఫ‌ర్వాలేదులే.. ఆంటీ అని పిలువ్‌".. కీర‌వాణి కొడుకుతో సుమ‌!

యాంకర్ సుమ బుల్లితెరపై చేసే సందడి మాములుగా ఉండదు. వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఇక యాంకర్ రవితో కలిసి 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్' అనే షోని హోస్ట్ చేస్తుంటుంది సుమ. ఈ షోలో రవి మీద సుమ వేసే సెటైర్లు బాగా వైరల్ అవుతుంటాయి. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకి కీరవాణి కుమారుడు హీరో శ్రీ‌సింహా గెస్ట్ గా వచ్చారు. "సింహమంటి చిన్నోడే" అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా.. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు సింహా.

రాగానే "సుమ గారు, రవి గారు.." అని ఏదో చెప్పబోతుండగా.. సుమ కలుగజేసుకొని "పర్వాలేదులే.. ఆంటీ అని పిలువు" అని చెప్పింది. దానికి సింహా.. "అది మీ తప్పే ఆంటీ.. నా చిన్నప్పడు మీరు అలానే ఉన్నారు. నేను పెద్దయ్యాక కూడా మీరు అలానే ఉన్నారు." అంటూ కౌంటర్ వేశాడు. ఇది విన్న రవి.. సుమని ఉద్దేశిస్తూ "సింహా గారు మీకు చిన్నప్పటి నుండే తెలుసా..?" అని ప్రశ్నించగా.. దానికి సుమ.. "నా చిన్నప్పటి నుండి కాదు.. వాళ్ల చిన్నప్పటి నుండి తెలుసు" అంటూ మరో కౌంటర్ వేసింది.

ఆ త‌ర్వాత‌ రవి.. "సింహ గారు కాబట్టి సింహంలా గర్జిస్తే చూడాలని ఉంది" అని అడగ్గా.. ''నువ్ నా నుండి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్.. 'మగధీర' కాదిక్కడ, 'మర్యాద రామన్న'' అంటూ తన సినిమాలో డైలాగ్ చెప్పేశాడు సింహా. ఆ తర్వాత మెజీషియన్ తో కలిసి యాంకర్ రవిని ఓ ఆట ఆడేసుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది. ఈ షో పూర్తిగా చూడాలంటే ఆదివారం వరకు ఎదురుచూడాల్సిందే!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.