English | Telugu

"వింధ్యా.. మీరు నిజ‌మైన రాక్ స్టార్‌!".. తెలుగు యాంక‌ర్‌కు సోను సూద్ ప్ర‌శంస‌!

తెలుగు యాంకర్ వింధ్యపై నటుడు సోను సూద్ ప్రశంసలు కురిపించాడు. నిజమైన రాక్ స్టార్ మీరేనంటూ ఆమెని తెగ పొగిడేశాడు. ఈ విషయాన్ని వింధ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సోను సూద్ తన గురించి మాట్లాడుతున్న వీడియోను వింధ్య షేర్ చేసింది. అందులో సోను.. వింధ్య‌ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.

''హాయ్ వింధ్యా.. మీరు చేసిన సాయానికి చిన్న 'థాంక్స్' అనే పదం సరిపోదు. సోను సూద్ ఫౌండేషన్ పై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన రాక్ స్టార్. మీరు చేసిన సాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా.. జాగ్రత్తగా ఉండండి'' అంటూ సోను మాట్లాడాడు.

ఈ వీడియోను షేర్ చేసిన వింధ్య తెగ సంబ‌ర‌ప‌డిపోయింది. సోను లాంటి వ్య‌క్తి త‌న‌ను పొగ‌డ‌టం న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని, త‌న‌కు మాట‌లు రావ‌ట్లేద‌నీ ఆనందం వ్య‌క్తం చేసింది.

కరోనా సమయంలో సోను సూద్ చాలా మందికి సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. సోను సూద్ ఫౌండేషన్ పేరుతో విరాళాలు సేకరించి ఎంతో మంది సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ వింధ్య కూడా తన దగ్గర ఉన్న బట్టల క‌లెక్ష‌న్‌ను వేలం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుని సోనూసూద్ ఫౌండేషన్ కు పంపించింది. దీంతో సోనూ.. ప్రత్యేకంగా వింధ్యకు కృతజ్ఞతలు చెప్పారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.