English | Telugu

ఝాన్సీ మేక‌ప్‌మేన్ ఎంత మంచివాడంటే...

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉపాధిని కోల్పోయి.. తినడానికి తిండి లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు.

ఇందులో భాగంగా యాంకర్ ఝాన్సీ తనకు వీలైనంతలో కొంతమందికి నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ఈ మేరకు తన టీమ్ తో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన మేకప్‌మేన్‌, టచప్ అసిస్టెంట్ రమణ చేస్తోన్న మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు. వారికోసం ఇచ్చిన డబ్బులను కూడా ఇతరుల కోసమే వాడుతున్నారని ఝాన్సీ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

''నాకు వీలైనంతలో ఒక పాతిక మందికి నెల సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అది నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినా కూడా అతడు తనకు ఇబ్బంది లేదని చెప్పి అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసర సరుకులు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు.. మా శ్రీను, రమణ జన్మతః గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు. వీరితో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.