English | Telugu

క్రౌడ్ ఫండింగ్ అన్న చేసి ఒక మంచి మూవీ తీస్తా..బిగ్ బాస్ కంటెస్టెంట్


బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రీతిన ఉన్నారు. అందులో నిఖిల్, పృద్వి ఒక లెక్క ఉంటె, గౌతమ్ ఇంకో లెక్క..ఇక నబీల్ ఐతే మరో లెక్క. సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువతక్కువ మాట్లాడడు. కానీ చేయాలనుకున్నది చేస్తాడు. అలాంటి నబీల్ తన యూట్యూబ్ లో తన ఫస్ట్ ఇంటర్వ్యూని పోస్ట్ చేసాడు. "బిగ్ బాస్ 5 చూసాక నాకు బిగ్ బాస్ కి వెళ్లాలని అనిపించింది. బిగ్ బాస్ 7 కి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలయ్యింది. ఆ ఇంటర్వ్యూస్ లో మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. సోషల్ మీడియాలో మనం బాగా ఫేమస్ అవ్వాలి. మన ప్రొఫైల్ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరకు వెళ్తే అది కూడా వాళ్లకు నచ్చితే పిలుస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అంటే ప్రతీ ఒక్కరికీ తెలుస్తాం. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు. బిగ్ బాస్ బయాస్డ్ కూడా కాదు. మొదటి టు వీక్స్ బాగా అబ్జర్వ్ చేసి తర్వాత గేమ్ ఆడడం స్టార్ట్ చేశా. హౌస్ లో ఎవరైనా బాధపడుతూ ఉంటే అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నాను. మానికంతా, నిఖిల్, పృద్వి వంటి వాళ్లకు ధైర్యం చెప్పా. మొబైల్ లేకుండా ఇన్ని రోజులు ఉండడం నిజంగా గ్రేట్. మొబైల్ లేకుండా కూడా ఉండగలను అని అనిపించింది. బిగ్ బాస్ కి ఒక్కరమే వెళ్తాం ఒక్కరమే వస్తాం. ఇక ఈ ఎమోషనల్ బాండింగ్ వంటివి పెట్టుకోకూడదు అనుకుని వెళ్ళాం.. నేను ఫేస్బుక్ లో 4 వ తరగతిలోనే ఓపెన్ చేశా..నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక కమ్యూనిటీ మ్యాటర్ గురించి తెలిసింది.

నా ఫ్రెండ్స్ లిస్ట్ లో హిందూస్, క్రిస్టియన్స్, సిక్స్ అందరూ ఉన్నారు. నేను వెళ్లి వాళ్ల ఇంట్లో పడుకుంటా.. వాళ్లు వచ్చి నా ఇంట్లో పడుకుంటారు. నాకు నా రిలేటివ్స్ కంటే నా ఫ్రెండ్స్ ముఖ్యం. మా పెద్దన్న పెళ్లిలో నా దోస్త్‌లే ఎక్కువ ఉన్నారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళే పనులు చక్కబెడతారు . ఈ కమ్యునిటీ ఫీలింగ్‌‌ని నేను పట్టించుకోను. నేను అందరితో కలిసి ఎలా ఉంటానో నాతో ఉండే దోస్త్‌లను అడిగితే చెప్తారు. మెహబూబ్ నాకు చెప్తున్నప్పుడు జస్ట్ నేను విన్నానంతే. అసలు రియాక్ట్ కాలేదు. వరంగల్ డైరీస్ ని కంటిన్యూ చేస్తాను. మూవీ ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అవి కూడా నటిస్తాను. ఐదేళ్ల తర్వాత గట్టిగ సంపాదిస్తే నేనొక సినిమా తీస్తా లేదంటే క్రౌడ్ ఫండింగ్ అన్నా చేసి మూవీ తీస్తా. ముందుగా తెలుగు ప్రజల కోసం తెలుగు కంటెంట్ చేస్తా అలాగే హిందీ వీడియోస్ చేస్తా.తెలుగు, హిందీ ఆడియన్స్ నా రెండు కళ్ళ లెక్క. అందరినీ ప్రేమిస్తాను. " అని చెప్పాడు నబీల్.