English | Telugu

సీరియల్ నుండి తీసేయడంతో భోరుమ‌న్న‌ నటి!

'నా పేరు మీనాక్షి' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి.. మధు రెడ్డి. 2015 నుండి 2021 వరకు ఆమె ఈ సీరియల్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో డెలివెరీ కోసం బ్రేక్ తీసుకున్నప్పటికీ.. తిరిగి అదే సీరియల్ లో రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఆమె సీరియల్ లో కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆమెని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమె వివరణ ఇస్తూ బోరున ఏడ్చేసింది.

చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ 'నా పేరు మీనాక్షి' సీరియల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అయితే కొన్నాళ్లుగా ఈ సీరియల్ డేట్స్ కోసం ఒకటి రెండు రోజులు మాత్రమే తనను అడుగుతున్నారని తెలిపింది. దానికోసం పదిహేను నుండి ముప్పై రోజులు బ్లాక్ చేస్తుండడంతో వేరే సీరియల్స్ చేయలేకపోతున్నానని దర్శకనిర్మాతలకు చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. నెలలో రెండు రోజుల కోసం నెలంతా గడపాలంటే కష్టమని చెప్పింది.

అయినప్పటికీ 'నా పేరు మీనాక్షి'తో మంచి పేరు రావడంతో సీరియల్ ను వదల్లేకపోయానని తెలిపింది. అయితే తను దర్శకనిర్మాతలను అడగడంలో తప్పు ఉందో ఏమో తెలియదు కానీ తనను మొత్తానికి సీరియల్ నుండి తప్పించినట్లు వివరించింది మధు రెడ్డి. పిలుస్తారులే అని చాలా రోజులు చూశానని.. కానీ అలా జరగలేదని ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.