English | Telugu

హైపర్ ఆదిని అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన ఓంకార్!

బుల్లితెరపై రోజుకో ఎంటర్టైన్మెంట్ షో పుట్టుకొస్తూనే ఉంది. అయితే ఓంకార్ హోస్ట్ చేసే షోలు కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇస్మార్ట్ జోడి, డ్యాన్స్ ప్లస్, సిక్స్త్ సెన్స్ వంటి షోలతో ఓంకార్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యనే డాన్స్ ప్లస్ షోను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు సిక్స్త్ సెన్స్ కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఓంకార్‌. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన మూడు సీజన్లను టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు నాల్గో సీజన్ రాబోతుంది.

ఈ షోకి బుల్లితెర తారలు, టాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకొచ్చి గేమ్స్ ఆడిస్తుంటారు ఓంకార్. తాజాగా ఈ కొత్త సీజన్‌కు హైపర్ ఆది, అనసూయలను గెస్ట్ లుగా తీసుకొచ్చారు ఓంకార్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు అది యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇందులో హైపర్ ఆది షర్ట్ తీయించి అర్ధనగ్నంగా కూర్చోబెట్టారు ఓంకార్.

ఛాలెంజ్ లో ఓడిపోవ‌డంతో హైపర్ ఆది తన షర్ట్ ను తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతడు.. ''ఆది కేశవరెడ్డిలా వస్తే అర్జున్ రెడ్డిలా చేశారంటూ'' కౌంటర్ వేశాడు. గేమ్‌లో ఆదిని బాగా టెన్షన్ పెట్టేశారు ఓంకార్. దీంతో అతడు టెన్షన్ తట్టుకోలేక.. "ఆ లక్ష మీకే ఇచ్చేస్తాను నన్ను వదిలేయండి." అంటూ బతిమాలుకున్నాడు. "ఇలా కూడా బ్రతకనివ్వరా!" అంటూ ఓంకార్ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆదితో పాటు అనసూయను కూడా బాగానే టెన్షన్ పెట్టినట్లు ఉన్నారు ఓంకార్.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.