English | Telugu

నిజ జీవితంలో 'వంట‌ల‌క్క' భ‌ర్త ఏం చేస్తుంటారో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). మలయాళంలో వచ్చిన 'కరుతముత్తు' అనే సీరియల్ కు రీమేక్ గా దీన్ని రూపొందించారు. ఈ ఒక్క సీరియల్ తో మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్ మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే సీరియల్స్ లో నటించకముందు ఆమె ఏం పని చేసేదో తెలుసా?..

1991 డిసెంబర్ 2న కేరళలో జన్మించిన ప్రేమి విశ్వనాథ్ లా కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత ఓ ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పని చేసింది. ఇక సీరియల్స్ లో నటించడం కంటే ముందు మోడల్ గానూ రాణించింది. అంతేకాకుండా.. 'సాల్మ‌న్‌ 3 డీ' సినిమాలో కూడా నటించింది. ప్రేమి అన్నయ్య శివప్రసాద్ కేరళలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయి. తన సోదరుడిలానే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పని చేసిందట ప్రేమి విశ్వనాథ్.

ఇక ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలజీలో పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఆయన వద్దకు పలువురు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వాళ్లు వస్తుంటారట. ప్రేమి-వినీత్ లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇక ప్రేమి విశ్వనాథ్ కు తెలుగులో పలు సినీ అవకాశాలు కూడా వస్తున్నాయట. కానీ ప్రస్తుతం ఆమె సీరియల్ మీదే ఫోకస్ పెట్టారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.