Read more!

English | Telugu

కృష్ణ, ముకుంద నడుమ నలిగిపోతున్న మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 153 లో.. మురారి విషయంలో తను చేసిన తప్పుని గుర్తుచేసుకుంటుంది కృష్ణ. ఇంత మనసున్న మహారాజుకి బర్త్ డే గిఫ్ట్ ఏం ఇవ్వాలి.. ఏం ఇచ్చి ఋణం తీర్చుకోవాలి.. ఏసీపీ సర్ సర్ ప్రైజ్ అయ్యేలా ఉండాలంటూ గిఫ్ట్ గురించి ఆలోచిస్తుంది కృష్ణ.

మరొకవైపు మురారి ఒంటరిగా ఆలోచిస్తుంటాడు. ఈ మధ్య కృష్ణలో చాలా మార్పు వచ్చింది. కానీ నన్ను ప్రేమిస్తున్నట్లు బయటపడట్లేదు. ఇదివరకు నేను తాకితేనే చిరాకు పడే కృష్ణ.. ఇప్పుడు నాకు దగ్గరగా వస్తుంది. రేపు నా బర్త్ డే కాబట్టి నా ప్రేమ విషయాన్ని కృష్ణకి చెప్తానని మురారి అనుకుంటాడు. ఇంతలోనే మురారి వెనకాల నుండి ముకుంద వచ్చి.. తన భుజాలపై తల వాలుస్తుంది.. ముకుందని చూసి మురారి షాక్ అవుతాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మురారి అని చెప్పగానే..  థాంక్స్ అని మురారి అంటాడు. లాస్ట్ ఇయర్ నీ బర్త్ డే ని మనిద్దరం సెలెబ్రేట్ చేసుకున్నాం గుర్తుందా.. నా మనసులో ఆదర్శ్ కి స్థానం లేదు.. నీ మనసులో కృష్ణకి స్థానం లేదు.. మనిద్దరం పెళ్లి చేసుకుందామని ముకుంద అంటుంది. ఏంటి ముకుంద.. ఇంకా ఆ ఆలోచనలతోనే ఉన్నావా అని మురారి అంటాడు.

మన ప్రేమకి ఆ దేవుడు పరీక్ష పెడుతున్నాడు మురారి.. మనమిద్దరం పెళ్లి చేసుకొని మన ప్రేమని బ్రతికించుకుందామని ముకుంద అంటుంది. అర్థరాత్రి 12 గంటలకు నీతో కేక్ కట్ చేయిస్తాను.. నువ్వు లైఫ్ లో మర్చిపోలేని సర్ ప్రైజ్ ఇస్తాను.. నువ్వు తప్పకుండా రావాలని ముకుంద చెప్తుంది.

మురారి మాత్రం సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మురారి డల్ గా ఉండడం చూసిన కృష్ణ.. ఏంటి బయటకు వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు.. లోపలికి వచ్చేటప్పుడు ఇలా అయిపోయారు.. బయట ఏం జరిగిందని అడుగుతుంది. ఏం జరగలేదు.. అన్ని నీకే కావాలని కృష్ణపై కోప్పడతాడు మురారి. మళ్ళీ కాసేపటికి.. సారీ కృష్ణ.. ఏదో వర్క్ టెన్షన్ లో అలా అన్నానని మురారి అంటాడు. సరే మీరు తొందరగా పడుకోండని కృష్ణ అంటుంది. ఏంటి తొందరగా పడుకో అంటున్నావని మురారి అంటాడు. అంటే అది చెప్పొద్దని అనుకున్నాను కానీ.. మీతో నైట్ కేక్ కట్ చేపిస్తా అని కృష్ణ అనగానే.. వద్దని  అంటాడు మురారి. ఆ తర్వాత ముకుంద అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కంగారుపడతాడు మురారి‌. ఇంట్లో ఎవరు మాట్లాడట్లేదు.. ఇలా మనం సెలెబ్రేట్ చేసుకుంటే పెద్దమ్మ ఏమైనా అంటుందని మురారి అంటాడు. ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను.. మీరు పడుకోండని కృష్ణ అంటుంది. 

ఆ తర్వాత మురారిని ముకుంద గుర్తుచేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు మురారి చేసిన పనులను భవాని గుర్తు చేసుకుంటుంది. వాడి పుట్టినరోజుకి నేనే మొదటగా విష్ చేసేదాన్ని అని భవాని బాధపడుతుంది. విషెస్ చెప్పాలని ఉన్నా.. నేనెందుకు చెప్పాలని భవాని తనలో తాను అనుకుంటుంది. మరొకవైపు మురారి ఒక్కసారిగా నిద్ర నుండి లేచి టైం చూస్తాడు.. అప్పుడే కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.