Read more!

English | Telugu

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త మలుపు.. రాజ్ కనిపెట్టేసాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో... రాజ్ ని కావ్య పక్కకి పిలిచి మాట్లాడుతుంది. అంతమంది ముందు ఇలా పక్కకి పిలిస్తే అందరూ ఏమనుకుంటారని రాజ్ అంటాడు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి.. మా అక్కని, తన లవర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని కావ్య అంటుంది‌. ఇప్పుడా.. పూజ జరుగుతుంది కదా.. ఇప్పుడెలా వెళతామని రాజ్ అనగానే.. మీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. దానివెనుక ఉన్న నిజమేంటో తెలియాలంటే మీరు రావాలి.. లేదంటే నేను మీ ఇంటిదగ్గరే ఉండిపోతానని కావ్య అనగానే సరే అని రాజ్ అంటాడు. ఇద్దరు కలిసి అక్కడ నుండి బయల్దేరతారు.

మరొక వైపు అప్పు, కళ్యాణ్ లు.. కావ్య, రాజ్ ల గురించి ఎదురు చూస్తుంటారు. వాళ్ళు వచ్చే సరికి మనం ఇక్కడ ఉండకూడదు. మీ అన్నయ్య మనల్ని చూసి మనం ఇదంతా కావాలనే చేసామని అనుకుంటాడని అప్పు అంటుంది. మరొకవైపు స్వప్నని చూసిన రాహుల్ టెంప్ట్ అవుతాడు. ఇప్పుడు దీని అందం చూసి మోసపోతే.. నా పని అయిపోతుంది.. ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత ఎందుకు పిలిచావని స్వప్నని అడుగుతాడు. దానికి స్వప్న కోపంగా ఇంత అందంగా రెడీ అయి వచ్చాను.. ఈ చీర బాగుంది.. నువ్వు బాగున్నావ్ అని అనొచ్చు కదా.. రోజురోజుకి నా మీద ఇష్టం తగ్గిపోతుందని స్వప్న కోప్పడుతుంది. అదేం కాదు అక్కడ పూజ జరుగుతుంది కదా.. అందరూ ఉన్నారు.. నేను లేకపోతే బాగుండదని అలా అన్నాను.. ఈ చీరలో నువ్వు దేవకన్యలా ఉన్నావని బిస్కెట్ వేస్తాడు రాహుల్. దాంతో స్వప్న సిగ్గుపడుతుంది.

అలాగే రాహుల్ చెప్పిన ప్రతిది నమ్ముతుంటుంది. మరొకవైపు రాజ్, కావ్య ల కోసం వచ్చిన ధన్యలక్ష్మికి వాళ్ళు కన్పించకపోయేసరికి.. అక్క రాజ్, కావ్య ఇద్దరు కన్పించడం లేదని అనగానే అందరూ షాక్ అవుతారు. కనకం భయపడుతూ.. ఏంటి ఇప్పటికే స్వప్న పెళ్ళిలో పరువు తీసిందని బాధ పడుతుంటే.. ఇప్పుడు పూజలో నుండి వీళ్ళు ఎక్కడికి వెళ్లారు.. ఇంకా నయం ఇద్దరు లేరు.. అదే కావ్య ఒక్కతే లేకుంటే.. ఈ అపర్ణతో లొల్లి మాములుగా ఉండేది కాదని కనకం తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు రాజ్, కావ్యలు పార్క్ దగ్గరికి వస్తారు. అప్పుడే స్వప్నతో రాహుల్ సరసాలాడుతూ.. అక్కడికి వచ్చిన రాజ్, కావ్యలను చూస్తాడు.. స్వప్న కూడా చూసి వీళ్ళేంటిక్కడ అని షాక్ అవుతుంది. నువ్వు పారిపో స్వప్న అని రాహుల్ అంటాడు. లేదు నేను పారిపోను. ఎందుకు భయపడడం నిజం చెప్దామని స్వప్న వాదిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్ళు అని రాహుల్ అనగానే.. స్వప్న పారిపోతుంటుంది.

అలా స్వప్న పారిపోతుండగా రాజ్, కావ్యలు వాళ్ళిద్దరిని చూస్తారు. వాళ్లిద్దరిని అలా చుసిన రాజ్ ఆశ్చర్యపోతాడు. స్వప్న పారిపోతుండగా అక్క ఆగు అని కావ్య ఆపే ప్రయత్నం చేస్తుంది. అలా ఆపగా కావ్యని నెట్టేసి వెళ్ళిపోతుంది స్వప్న. చూసారా మీ ఇంట్లో ఉంటూ.. మీకు ఎంత నమ్మక ద్రోహం చేసాడో అని కావ్య అంటుంది. రాహుల్ వచ్చి మీరేంటి ఇక్కడ అని రాజ్ ని అడుగుతాడు. రాజ్ ఏం అనకపోయేసరికి.. పదండి వెళదామని రాజ్ చెయ్యి పట్టుకుంటాడు రాహుల్. దాంతో రాజ్ కోపంగా రాహుల్ చెంప పగులగొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.