Read more!

English | Telugu

రిషి, వసుధారల ఎంగేజ్మెంట్..  శైలేంద్ర ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -759 లో.. సౌజన్యరావు ఇదంతా చేసింది నువ్వేనా అని రిషి అనగానే.. ఒకసారి ఏదో చేసానని అన్ని నేనే చేశానని అంటే ఒప్పుకోనని సౌజన్య రావు అంటాడు. రిషి ఆవేశపడుతూ మాట్లాడుతుండగా.. శైలేంద్ర తనని ఆపి.. నువ్వు వెళ్ళు రిషి నేను మాట్లాడి, మన జోలికి రాకుండా చేస్తాను. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని అంటాడు శైలేంద్ర. రిషి వెళ్ళగానే శైలేంద్ర నవ్వుతూ.. ఇలానే చేస్తూ ఉండమని అంటాడు. రిషి కార్ లో నుండి చూస్తుండగా.. సౌజన్యరావుకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతాడు. కాసేపటికి సౌజన్య రావు వెళ్ళిపోతాడు.

మరొకవైపు అందరూ ఇంట్లో హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే పక్కింటి వాళ్ళు వ్రతం చేస్తున్నామంటూ పిలవడానికి వస్తారు. దేవయాని, మీరు(జగతి) తోడికోడళ్ళ లాగా కాకుండా.. సొంత అక్క చెల్లెళ్ళలాగా కలిసుంటారని పిలవడానికి వచ్చినవాళ్ళు అంటారు. ఇక దేవయానిని వాళ్ళింట్లో చేసుకుంటున్న వ్రతానికి రమ్మని పిలిచి, అలాగే జగతిని కూడా పిలుస్తారు. అప్పుడే అక్కడ ఉన్న వసుధారని పిలుస్తారు.. నీ మెడలో తాళి ఎక్కడ అని అడుగుతారు. లేదు మేం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని వసుధార అనగానే.. ఏంటి మీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా ఇన్ని రోజులు కలిసి ఉన్నారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు ఆడుగుతారు. దాంతో అందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ దేవయాని మాత్రం అలా వసుధారని అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాకు వాళ్ళిద్దరు అలా ఉండడం తప్పనిపించలేదని మహేంద్ర అంటాడు. మీరు సొసైటీలో ఉన్నప్పుడు కొంచెం వాళ్లకి నచ్చినట్లు కూడా ఉండాలని పిలవడానికి వచ్చిన వాళ్ళు అంటారు.

నేను చెపితే ఎవరు వినరు.. పెళ్లి కాకుండా ఇలా ఉండొద్దని అంటే వింటారా అని దేవయాని అంటుంది. అప్పుడే ఫణీంద్ర కలుగజేసుకొని.. మాకు లేని ప్రాబ్లం మీకేంటి, వ్రతానికి పిలవడనికి వచ్చారు.. పిలిచారు కదా ఇక వెళ్ళండని అంటాడు. అయినా మీలాంటి సంప్రదాయం లేని వారు.. మా వ్రతానికి రాకుండా ఉండడమే మంచిదంటూ చెప్పేసి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత పెళ్ళి కాకుండా ఇలా ఉండకూడదని నేను చెప్తే ఎవరూ వినరు కదా అని వాళ్ళిద్దరిని ఉద్దేశించి దేవయాని అనగా.. అయితే పెళ్ళి చేద్దాం మమ్మీ.. ఇవన్నీ ఎందుకని దేవయానితో శైలేంద్ర అంటాడు. ఇప్పుడు శూన్యమాసం ముహుర్తాలు లేవని దేవయాని అంటుంది. అయితే ఏదైనా పెట్టుడు ముహుర్తం చూసి ముందు ఎంగేజ్మెంట్ చేద్దామని శైలేంద్ర అనగా.‌. అందరూ ఒప్పుకుంటారు. రిషి, వసుధారలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే శైలేంద్ర దీని వెనకాల ఏదో కుట్ర చేస్తున్నాడేమోనని జగతి భయపడుతుంది. జగతి దగ్గరికి వచ్చిన రిషి.. మేడం వసుధారని షాపింగ్ కి తీసుకెళ్తానని అనగానే.. తీసుకెళ్ళమని అంటుంది జగతి. వసుధారని రిషి తన గదిలోకి తీసుకెళ్ళి.. ఏం షాపింగ్ చేద్దామని అనుకుంటున్నావ్.. VR లెటర్స్ గల రింగ్ ఒకటి, ఇంకొకటి అంటూ రిషి ఏదో చెప్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.