Read more!

English | Telugu

అమ్ములుకి కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన అంకిత్!

ప్రియాంక జైన్ అంటే చాలా కొద్ది మందికే తెలుస్తుంది కానీ 'మౌనరాగం' సీరియల్‌ లో నటించిన అమ్ములు అంటే అందరికీ గుర్తొచ్చేస్తుంది. ఇక ఇదే సీరియల్ లో అంకిత్ గా నటించిన శివ కుమార్ కూడా అందరికీ తెలిసిన నటుడే. వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న 'జానకి కలగనలేదు' సీరియల్‌లో జానకిగా లీడ్ రోల్ లో నటిస్తోంది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్. ఆన్ స్క్రీన్‌లో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీళ్ళ లవ్ ని ఎక్సప్రెస్ చేస్తూ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. 

ఐతే శివ కుమార్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం రీసెంట్ గా ఒక కార్ కొనిచ్చాడు. నెక్సా వారి 25 లక్షల విలువైన గ్రాండ్ విటారాని గిఫ్ట్ గా ఇచ్చాడు. ముందుగా ప్రియాంక వాళ్ళ ఫామిలీ మొత్తాన్ని కళ్ళకు గంతలు కట్టి డైరెక్ట్ గా కార్ షోరూమ్ కి తీసుకెళ్లి అక్కడ కార్ చూపించి సర్ప్రైజ్ ఇచ్చాడు. వాళ్లంతా శివ కుమార్ కి విషెస్ చెప్పారు. ఇక అక్కడే కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. 

'మౌనరాగం' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సినిమా హీరోయిన్ కూడా. కన్నడలో ఒక మూవీలో నటించింది. తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి మూవీస్ లో నటించింది. కొంతకాలం క్రితం సీమంతం జరిగినట్టుగా  కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే అవి సీరియల్ లో భాగంగా జరిగిన ఫోటో షూట్ అన్న విషయం తర్వాత అర్ధమయ్యింది. శివ కుమార్ 'ఇంటికి దీపం ఇల్లాలు' సీరియల్ లో చేస్తున్నాడు.