English | Telugu

చచ్చిపోతానేమో అని భయపడ్డా!

'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ కి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అవినాష్ తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఒకానొక సమయంలో ట్రోఫీ తనే పట్టుకుపోతాడేమో అనుకున్నారు. కానీ హౌస్ లో కొన్ని గొడవల్లో అవినాష్ ఇన్వాల్వ్ అవ్వడం, ఎలిమినేషన్ వరకు వెళ్లడం వంటి విషయాలు అతడ్ని వెనక్కి లాగేశాయి. కానీ అవినాష్-అరియనా ట్రాక్ మాత్రం జనాలను ఆకట్టుకునేది.

ఇదిలా ఉండగా.. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అవినాష్ స్టార్ మా ఛానెల్ లోనే పలు షోలతో బిజీ అయ్యాడు. 'కామెడీ స్టార్స్' షోలో తన స్కిట్ లతో కామెడీ పండిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ షోలో పాల్గొన్న అవినాష్ కరోనా భయంతో తను చనిపోతానేమో అని భయపడిన విషయాన్ని వెల్లడించాడు. షోలో భాగంగా ఓ టీమ్ 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాలో 'ఆశా పాశం' అనే పాటకు పెర్ఫార్మ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు కరోనా సోకి చనిపోవడం, కనీసం కుటుంబ సభ్యులకు కూడా చివరి చూపు దక్కకపోవడం వంటి విషయాలను తమ పెర్ఫార్మన్స్ ద్వారా అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇది చూసిన అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్ గా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. మొదటి మూడు రోజుల్లో అయితే చనిపోతానేమో అని భయపడిపోయానని చెప్పుకొచ్చాడు. నటి అషురెడ్డి కూడా ఈ పెర్ఫార్మన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తన తాతయ్య కూడా కరోనాతో చనిపోయారని.. చివరిచూపుకి కూడా నోచుకోలేకపోయామంటూ ఏడ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.