English | Telugu

ఆ సినిమా వల్ల చాలా బాధపడ్డా! కొన్ని రోజులు బ‌య‌ట‌కు రాలేదు!!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జబర్దస్త్' షోతో ఫేమస్ అయిన ఈ భామ ఈరోజు 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్ లో ఓ సినిమా కారణంగా ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు బయటకు కూడా రాలేకపోయానని చెబుతోంది. 2013లో ఎన్టీఆర్ నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అనసూయ.

దాదాపు పదమూడేళ్ల తరువాత ఆమె నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'లో ఆయ‌న మ‌ర‌ద‌లి పాత్ర‌లో మెరిసింది. ఆ వెంటనే 'క్షణం' సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ పోషించింది. ఇక ఆ తరువాత ఐటెం సాంగ్స్ అని, గెస్ట్ రోల్స్ అని బిజీగా గడిపింది. 'రంగస్థలం' సినిమాలో చేసిన రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఖిలాడి', 'రంగమార్తాండ' అనే సినిమాలున్నాయి. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ 'కథనం' సినిమా కార‌ణంగా ఎంతో బాధ పడ్డానని చెప్పింది.

'క్షణం' సినిమా తరువాత 'కథనం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని.. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడిందని.. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పింది. దాంతో ఎంతో బాధపడ్డానని.. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయానని వెల్లడించింది. తనకు ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్‌ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.