English | Telugu

గోవాలో అవినాష్-అరియానా బైక్ రైడింగ్‌!

జ‌బ‌ర్ద‌స్త్ మాజీ కంటెస్టెంట్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇటీవ‌ల గోవా ట్రిప్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. అరియానా గ్లోరీతో క‌లిసి అవినాష్ అక్క‌డ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ జంట‌తో పాటు శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌, శ్రీ‌ముఖి త‌మ్ముడు సుప్రీత్‌, ఆర్జే చైతూ కూడా వెళ్లారు. అక్క‌డి బీచ్ స‌మీపంలో వున్న‌ గోవా కోలా రిసార్ట్‌లో సంద‌డి చేశారు.

పోర్ట్ ఏరియాకు బైకుల‌పై వెళ్లిన ఈ జంట‌లు ఎక్క‌డి నుంచి బీచ్ వ్యూని చూసి ఎంజాయ్ చేశారు. అరియానాతో క‌లిసి అవినాష్ బైక్ రైడింగ్ వెళ్లాడు. మ‌ధ్య‌లో ఆపి అరియానా బైక్ రైడ్ చేసిన దృశ్యాల‌కు సంబంధించిన వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. అవినాష్ వెన‌కాల కూర్చుని అరియానా రైడ్ చేస్తున్న దృశ్యాల‌ని షూట్ చేశాడు.

ఆ త‌రువాత ఫోర్ట్ ఏరియాలో వున్న మ‌ర్రి చెట్టు ఊడ‌ల్ని ప‌ట్టుకుని కోతిలా ఊగుతూ ముక్కు అవినాష్ కోతి కొమ్మ‌చ్చి ఆడిన దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. గోవా ట్రిప్‌కి సంబంధించిన వీడియోని అవినాష్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేశాడు. అది నెట్టింట సంద‌డి చేస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.