English | Telugu

బిగ్ బాస్ డ‌బ్బుతో సొహేల్ క‌ల నిజ‌మాయెగా!

బుల్లితెర‌పై మొద‌ట చిన్న పాత్ర‌ల్లో న‌టించి, 'కృష్ణ‌వేణి' లాంటి సీరియ‌ల్‌లో హీరోగా రాణించిన‌ ఇస్మార్ట్ స‌య్య‌ద్ సొహేల్ బిగ్‌బాస్ త‌రువాత క‌థ వేరేగానే వుంది. సీజ‌న్ 4లో టాప్ 5లో నిలిచిని సోహైల్ త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో... ఆక‌ట్టుకునే డైలాగ్‌ల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలోప‌డిన సొహేల్‌ చిరు నుంచి బంప‌ర్ ఆఫ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య స్వ‌యంగా చేసిన బిర్యానీని కూడా ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

త‌ను చేసే సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర అయినా తాను చేస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి.. ఇస్మార్ట్ సొహేల్‌‌కు బిగ్‌బాస్ ఫైన‌ల్ స్టేజ్ సాక్షిగా మాటివ్వ‌డంతో అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అంత‌కు ముందు సింగ‌రేణి ముద్దు బిడ్డ అంటూ షోలో హ‌ల్‌చ‌ల్ చేసిన సొహేల్‌ టాప్ 3కి వ‌చ్చేసరికి తెలివిగా ప్ర‌వ‌ర్తించి 25 ల‌క్ష‌ల క్యాష్‌తో ఇంటిదారి ప‌ట్ట‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

బిగ్‌బాస్ హౌస్‌‌లోనే కాదు, హౌస్‌ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కూడా సొహేల్‌ క‌థ వేరేగానే వుంది. హీరోగా ఓ సినిమాని ప్ర‌క‌టించిన సోహైల్ తాజాగా ఎంజీ హెక్ట‌ర్ కారుని సొంతం చేసుకున్నాడు. తండ్రి, త‌మ్ముడితో క‌లిసి షోరూమ్‌కి వెళ్లిన సొహేల్‌ ఎంజీ హెక్ట‌ర్ కారుని కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ. 30 లక్ష‌లు అని తెలిసింది. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు సొహేల్‌.

"ఫైన‌ల్లీ.. కొత్త కారు కొనాల‌నే ఒక క‌ల నిజ‌మైంది. దీన్ని సాధ్యం చేసిన బిగ్ బాస్‌కు, ఎప్పుడూ నాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన మా నాన్న‌కు థాంక్స్‌. హ‌లో ఎంజీ." అని వాటికి క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.