Read more!

English | Telugu

గుప్పెడంత మనసు అభిమానులకి ముఖేష్ గౌడ లేఖ!


గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి  అలియాస్ ముఖేష్ గౌడ కనిపించినప్పటి కంటే కూడా.. అతను ఆ సీరియల్‌ మానేసిన తరువాత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రిషి అంటే గుప్పెడంత మనసు సీరియల్‌కి గుండెకాయ. అటు వసుధారతో లవ్ ట్రాక్ కానీ.. ఇటు జగతితో మదర్ సెంటిమెంట్ కానీ.. పండించేసేవాడు. ఎమోషనల్ సీన్లతో కళ్లతోనే జీవించేసి కన్నీళ్లు పెట్టించేస్తాడు ముఖేష్ గౌడ. ఇక జగతి కాంబినేషన్‌లో సీన్లు అయితే.. కళ్లు ఆర్పకుండా అలా చూడాల్సిందే అన్నట్టుగా కనికట్టు చేస్తాడు ఈ హీరో. అయితే కారణం ఏమైనా కావచ్చు కానీ.. గుప్పెడంత మనసు సీరియల్‌కి గుండెకాయ అనుకున్న రిషిని పీకి పక్కనెట్టారు. వాళ్లు తీసేశారో.. లేదంటే ఇతనే తప్పుకున్నాడో.. ఎవరూ నోరు మెదపడం లేదు కానీ.. రిషి రాక కోసం జనాలు గగ్గోలు పెడుతున్నాడు. రిషి లేని గుప్పెడంత మనసా? మేం చూడం అంటూ ఆ సీరియల్‌పై తిరుగుబాటు చేశారు కానీ.. మను రాకతో సీరియల్ ఇప్పుడిప్పుడే గాడిన పడింది. 

అయితే కథ మాత్రం రిషి చుట్టూనే తిరుగుతుంది. రిషిని మరో మూడు నెలల్లో ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని శపథం చేసింది వసుధార. సీరియల్ కథనం ప్రకారం మూడు నెలలు అన్నారంటే రిషి అలియాస్ ముఖేష్ గౌడ రీఎంట్రీకి.. ఈ మూడు నెలలకు ఏదో లింక్ ఉండే ఉంటుంది. ప్రస్తుతం.. వసుధార, మనుల మధ్య ఏదో కొత్త ట్రాక్‌కి ప్రయత్నిస్తున్నారు కానీ.. అది బెడిసికొట్టడం ఖాయమే. ఎందుకంటే.. రిషిధార అంటే ఒక బ్రాండ్. పైగా ఇక్కడ వసుధార ప్రాణంతో ఉందంటే.. రిషి బతికి ఉన్నట్టే.. రిషి లేని వసుధార లేనేలేదు అని చెప్పిన వసుధారకి మను సపోర్టింగ్ ఇస్తున్నాడు. ఈ తరుణంలో రిషి అలియాస్ ముఖేష్ గౌడ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ సీరియల్ అభిమానులకి ఓ లేఖ రాశాడు. 

ఇందులో ఏం ఉందంటే.. మీకు ఈ సీరియల్ అంటే ఎంత అభిమానమే తెలుసు‌‌ కానీ నాకున్న హెల్త్ సమస్యల దృష్ట్యా నేను సీరియల్ షూటింగ్ కు దూరంగా ఉన్నాను. అంతే గానీ సీరియల్ మేనేజిమెంట్ తో గానీ డైరెక్టర్ తో గానీ నాకు ఎలాంటి గొడవ జరగలేదు. నాకేం ఇబ్బంది లేదు. త్వరలోనే మీ ముందుకొస్తాను. సీరియల్ దర్శకుడిని ఏం అనకండి అంటు రిషి అలియాస్ ముఖేష్ గౌడ లేఖ రాశాడు. అంటే మరికొన్ని రోజుల్లో ఈ సీరియల్ షూటింగ్ లో రిషి పాల్గొంటాడని అర్థమవుతుంది. ఈ సీరియల్ అభిమానులకి ఇక పండగే.